మన తెలంగాణ-బోడుప్పల్ : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు జోరందు కున్నాని, కార్పొరేషన్ ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది కదా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వివరణ అడిగిన విలేకరులపై బోడుప్పల్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రాధాకృష్ణారెడ్డి నిర్లక్షంగా సమాధానమివ్వడమే కాకుండా ఏమి రాస్తా రో రాసుకోండి, మీకు చెప్పి చేయాల్సిన పని లేదని తప్పించుకునే ధోరణీని ప్రదర్శిం చారు. సాక్షాత్తు కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి ముందే జరిగిన ఈ సంఘటన టిపిఎస్ రాధాకృష్ణారెడ్డి విలేకరులను బెదిరించే ధోరణితో వ్యవహరించడం చర్చనీయాంశంగా మా రింది. ఇటీవల 11వ డివిజన్ పరిధిలోని తిరుమల మెడోస్ కాలనీలో అనుమతులేని ఓ నిర్మాణాన్ని టిపిఎస్ ఆదేశాల మేరకు సిబ్బంది కూల్చివేశారు.
అయి తే ఆ నిర్మాణానికి ఎదురుగా చేపట్టిన మరో అక్రమ నిర్మాణంతో పాటు, వివిధ డివిజన్ లలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని ఎందుకు కూల్చలేదని అడిగిన ప్రశ్నకు టిపిఎస్ సమాధానం ఇవ్వకుండా మీరు చెబితే తాను కూల్చివేయాలా అంటూ తానిష్టముచ్చినట్లు చేస్తానని దుందుడుకు సమాధాన్నిమిచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్‌లలో అనుమతులు లేకుం డా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై వివరణ తీసుకునేందుకు ప్రయత్నించిన స్థానిక విలేకరులకు టౌన్ సూపర్ వైజర్ దురుసుగా ఇచ్చిన సమాధానం తన బాధ్యతలను విస్మరించే రీతిలో ఇవ్వడం విడ్డూరంగా ఉంది. మీరు ఏదైనా రాసుకోండి.. నాకేమి భయంలేదంటూ టిపిఎస్ పేర్కొనడం ఆయ న బాధ్యతారాహిత్యానికి నిదర్శనమైంది. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారే అ బాధ్యత తనదికాదంటూ తప్పించుకునే ధోరణితో వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరణ కోసం విలేకర్లపై చిందులేస్తూ నన్నే మి అడగద్దు.. కమిషనర్‌నే అడగండంటూ టిపిఎస్ రాధాకృష్ణారెడ్డి మేయర్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. బాధ్యతగల అధికారిగా రాధాకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరుపై బోడుప్పల్ కార్పొరేషన్ విలేకరులు నిరసన వ్యక్తం చేశారు.