కొలంబో: పొరుగు దిగువ దేశం లంకలో ఇంధన సంక్షోభం ప్రాణాలను తీస్తోంది. ట్రక్కు కదలాలంటే పెట్రోలు డీజిల్ చుక్కలు పడాలి. బండి కదిలితేనే తిండి తిప్పలు తీరేది. ఈ స్థితిలో కిలోమీటర్ల దూరం కొద్ది క్యూలలో నిలబడి నిలబడి తన పెట్రోలు డీజిల్ వంతుకోసం ఎదురుచూసిన ఓ ట్రక్కు డ్రైవర్ డస్సిపోయి దుర్మరణం చెందాడు. 63 ఏండ్ల ఈ డ్రైవర్ ట్రక్కు ఇంధనం లేక నిలిచిపోయింది. ఇంధనం కోసం ఎదురుచూపులు ఇప్పుడీ డ్రైవర్ ప్రాణాలను ఇంధన సరఫరాలు అరకొరగా ఉన్న పెట్రోలు బంక్‌ల వద్ద వెలిసిన పొడవాటి క్యూలు లంకలో ఇప్పటి ఆర్థిక స్థితికి దీని ద్వారా తలెత్తుతున్న సామాజిక దారుణాలకు దారితీస్తోంది. ఐదురోజుల పాటు ఈ ముసలి డ్రైవర్ పట్టు వీడకుండా దేశంలోని పశ్చిమ ప్రాంతపు బంక్ వద్ద క్యూలోనే ఉన్నాడు. ఓ వైపు తీవ్రమైన ఎండలు, ఆకలి, వాతావరణ మార్పులతో తట్టుకోలేక చనిపోయినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.
ఈ విధంగా ఇంధనం కోసం ప్రాణాలు వదిలిన వారి సంఖ్య ఇప్పటికి 10 అయింది. రాత్రింబవళ్లు డ్రైవర్లు క్లీనర్లు బంక్‌లను ఆనుకుని తమ వాహనాలను నిలిపేసుకుని ఉంటున్నారు. అయితే 43 నుంచి 84 ఏండ్ల వయస్సు లోపు వారు ఈ విధమైన పెట్రోడీజిల్ పడిగాపుల్లో పడి తట్టుకోలేకపోతున్నారు. తాము క్యూల నుంచి బయటకు ఇంధనం లేకుండా రాలేం. క్యూలలో రోజుల తరబడి ఉండలేం అని నిట్టూరుస్తున్నారు. ఎక్కువ మంది గుండెపోట్లువచ్చి చనిపోతున్నారని స్థానిక డెయిలీ మిర్రర్ పత్రిక తెలిపింది. వారం రోజుల క్రితం కొలంబోలోని పండూరా బంక్ వద్ద 53 ఏండ్ల వ్యక్తి క్యూలో నిలబడి మృతి చెందాడు. ఈ వ్యక్తి తన ఆటోలో జాగరణలు చేసి చేసి గుండెపోటుకు గురై మృతి చెందాడని వెల్లడైంది. 70 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా శ్రీలంక ఇప్పుడు తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభం చవిచూస్తోంది. ఇంధన నిల్వలు అడుగంటడం, వచ్చిన దిగుమతుల సరుకుల తీసుకునే విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో లంక చిక్కుముడి బిగిసింది.
Driver Dies after standing in Petrol queue for 5 days in Sri Lanka