Saturday, December 21, 2024

అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

2021-22 Industries Department releases annual report

రాజన్నసిరిసిల్ల: పేదలు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా వారికి న్యాయం జరగాలని సిఎం కెసిఆర్ కార్యక్రమాలు చేపడతారని మంత్రి కెటిఆర్ తెలిపారు. మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం భవనం నిర్మాణానికి కెటిఆర్ భూమి పూజ చేశారు. రెడ్డి భవన్ కోసం సిరిసిల్లలో నాలుగు ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రైతులు ఎలా చనిపోయినా కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా కల్పిస్తున్నామన్నారు. రైతు బంధు కింద రూ.55 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. అభివృద్ధి తన కులం అని, సంక్షేమం తన మతం అని స్పష్టం చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ప్రతి కులంలో పేదలు ఉన్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News