Monday, December 23, 2024

జెఈఈ మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

JEE mains candidates concern at Aurora Engineering College

హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జెఈఈ మెయిన్స్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష గంటన్నర ఆలస్యంగా 10:30 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష ఆలస్యంగా విద్యార్థులను అనుమతించారు. సర్వర్ డౌన్, సాంకేతిక కారణాలతో ఆలస్యం జరిగిందని సిబ్బంది చెబుతున్నారు. ఉదయం జరిగిన పరీక్షలో 26 ప్రశ్నలు కనిపించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అరోరా కాలేజీలో సరైన సదుపాయాలు లేవని.. తక్షణం సరైన పద్దతిలో పరీక్షలు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News