ఐబి చీఫ్‌గా తపన్ డేగా నియామకం
రా కార్యదర్శి సమంత్ గోయల్ పదవీకాలం పొడిగింపు
ప్రతిభకు పట్టంగట్టిన మోడీ సర్కార్
న్యూఢిల్లీ: సీనియారిటీకన్నా సామర్థానికి పెద్ద పీట వేసిన మోడీ ప్రభుత్వం శుక్రవారం తపన్ డేకాను ఇంటెలిజన్స్ బ్యూరో( ఐబి) చీఫ్‌గా నియమించింది. అలాగే రిసెర్చ్, అనాలసిస్ వింగ్(రా) కార్యదర్శిగా సమంత్ గోయల్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. ప్రస్తుతం ఐబిలో ఆపరేషన్ విభాగం చీఫ్‌గా పని చేస్తున్న తపన్ డేగా గత రెండు దశాబాలుగా ఉగ్రవాద, మత తీవ్రవాదం అణచివేత విషయంలో విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో ఆయన నిపుణుడు. 2019లో పౌరసత్వ చట్టం(సిఎఎ)కు వ్యతిరేకంగా అసోంలో అల్లర్లు చెలరేగినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనను ప్రతేకంగా అక్కడికి పంపించారు. నలుగురు సీనియర్ అధికారులను కాదని 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ ఐపిఎస్ అధికారి అయిన డేకాను ఐబి డైరెక్టర్‌గా నియమించడం ద్వారా మోడీ ప్రభుత్వం ఇంటెలిజన్స్ ఏజన్సీకి మరింత జవసత్వాలను అందించినట్లయింది. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రా కార్యదర్శిగా పని చేస్తున్న సమంత్ గోయల్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమన్వయంతో పని చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది.
Central Govt Appointed Tapan deka as IB Chief