Monday, December 23, 2024

భారత రాజ్యాంగం

- Advertisement -
- Advertisement -

Only woman MP in parliamentary committee on age of marriage for women

రాజ్యాంగ రూపకల్పన
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది. దీనిని కేబినెట్ మిషన్ ప్లాన్ 1946 ద్వారా ఏర్పాటు చేశారు.
స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే చారిత్రాత్మక పనిని పూర్తి చేయడానికి రాజ్యాంగ సభకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.
రాజ్యాంగ మూలాలు
భారత రాజ్యాంగం ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన దేశాల నుండి తీసుకోబడింది.
భారత రాజ్యాంగ సొంత ప్రత్యేక లక్షణాలను కూడా కలిగి ఉంది.
భారత ప్రభుత్వ చట్టం 1935
సమాఖ్య వ్యవస్థ
గవర్నర్ కార్యాలయం
న్యాయవ్యవస్థ
పబ్లిక్ సర్వీస్ కమిషన్
అత్యవసర నిబంధనలు
పరిపాలనా వివరాలు

బ్రిటీష్ రాజ్యాంగం
పార్లమెంటరీ వ్యవస్థ
చట్టపాలన, శాసన విధానం
ఏక పౌరసత్వం
కేబినెట్ వ్యవస్థ
ప్రత్యేక హక్కు రిట్లు
పార్లమెంటరీ హక్కులు
ద్విసభావిధానం

అమెరికా రాజ్యాంగం

ప్రాథమిక హక్కులు
స్వతంత్ర న్యాయవ్యవస్థ
న్యాయ సమీక్ష
రాష్ట్రపతి అభిశంసన
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు అధికారాలు
ఉపరాష్ట్రపతి పదవి

ఐరిష్ రాజ్యాంగం
బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య
కేంద్రం వద్ద అవిశిష్ట అధికారాలు
గవర్నర్ నియామకం

ఆస్ట్రేలియన్ రాజ్యాంగం

కేంద్ర జాబితా
పార్లమెంటు ఉభయ సభల సమావేశం
వాణిజ్య స్వేచ్ఛ, వాణిజ్యం

జర్మనీ రాజ్యాంగం

అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపివేయడం

ఫ్రెంచ్ రాజ్యాంగం

రాజ్యాంగ పీఠికలోని గణతంత్ర, స్వేచ్ఛ,
సమానత్వం, సోదరభావం ఆదర్శాలు

దక్షిణాఫ్రికా రాజ్యాంగం

రాజ్యాంగ సవరణ
రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం

జపనీస్ రాజ్యాంగం

చట్టం ద్వారా ఏర్పటు చేయబడిన విధానం

రాజ్యాంగ ముసాయిదా

క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫారసు చేసిన పథకాన్ని అనుసరించి రాష్ట్ర శాసన సభల సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకున్నారు.
రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యుల సంఖ్య 389
విభజన ఫలితంగా పాకిస్థాన్ కోసం ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడింది.
కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు అసెంబ్లీ సభ్యులుగా ఉండకపోవడంతో అసెంబ్లీ సభ్యత్వం 299కి తగ్గింది.

కేబినెట్ మిషన్

రెండో ప్రపంచ యుద్ధం మే 9, 1945న ముగిసింది.
భారతదేశ స్వాతంత్య్రం కోసం ముగ్గురు బ్రిటిష్ కేబినెట్ మంత్రులను పంపారు.
ఈ మంత్రుల బృందాన్ని క్యాబినెట్ మిషన్ అని పిలుస్తారు.
కేబినెట్ మిషన్ సభ్యులు 1. లార్డ్ పెథిక్ లారెన్స్ 2. స్టాఫర్డ్ క్రిప్స్ 3. అలెగ్జాండర్ ఎ.వి
కేబినెట్ మిషన్ మార్చి 1946 నుండి మే 1946 వరకు భారతదేశంలో ఉంది.
కేబినెట్ మిషన్ రాజ్యాంగ నిర్మాణం గురించి చర్చించడంతోపాటు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనుసరించాల్సిన విధానాన్ని కొంత వివరంగా పేర్కొంది.

అసెంబ్లీ 9 డిసెంబర్ 1946న పని ప్రారంభించింది.
రాజ్యాంగ రచన కమిటీలు
రాజ్యాంగ రచనకు పరిషత్ మొత్తం 22 కమిటీలను వేసింది.
వీటిలో 10 విధానాల రూపకల్పన కమిటీలు అయితే మిగతా 12 విషయ నిర్దారణ కమిటీలున్నాయి.

విధాన నిర్ణయ కమిటీలు:

రూల్స్ కమిటి/ నియమ నిబంధనల కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఆర్థిక, స్టాఫ్ కమిటీలకు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు.

తొలి తాత్కాలిక ప్రభుత్వం

సెప్టెంబర్ 2, 1946న మొదటి తాత్కాలిక జాతియ ప్రభుత్వం ఏర్పడింది.
దీనికి పండిట్ నెహ్రూ నాయకత్వం వహించారు.
తాత్కాలిక ప్రభుత్వ సభ్యులందరూ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి సభ్యులు.
వైస్రాయ్ రాజ్యాంగ పరిషత్ అధిపతిగా కొనసాగారు.
ముసాయిదా కమిటీ ఉపాధ్యక్షుడిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూను నియమించారు.

విషయ నిర్ధారణ కమిటీలు

వీటిలో రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీకి నెహ్రూ అధ్యక్షత వహించారు.
సర్ధార్ సలహా సంఘాన్ని జనవరి 22, 1947న వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
సలహా సంఘంలో ఒక అధ్యక్షుడితోపాటు 54 మంది సభ్యులున్నారు.

ఇదే అతిపెద్ద సంఘం, దీనిలో 4 ఉపసంఘాలున్నాయి.

అవి. 1. ప్రాథమిక హక్కుల ఉపసంఘం జె.బి కృపలాని అధ్యక్షులు
2. అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ అధ్యక్షులు హెచ్‌సీ ముఖర్జీ
3. గిరిజనుల కమిటీకి గోవర్దన్ అధ్యక్షత వహించారు.
4. మినహాయింపుల కమిటీకి తక్కర్ అధ్యక్షడు.

డ్రాఫ్టింగ్ కమిటీ (ముసాయిదా కమిటీ)

దీనికి డా. బిఆర్ అంబేద్కర్ అఢ్యక్షత వహించారు.
దీనిలో అధ్యక్షుడితోపాటు మరో ఆరుగురు సభ్యులున్నారు.
1. మాదవరావు (మిట్టల్ ఆనారోగ్యంతో అవకాశం)
2. గోపాల స్వామి అయ్యంగార్
3. కృష్ణ స్వామి అయ్యంగార్
4. కృష్ణమాచారి (ఖైతాన్ మరణంతో అవకాశం)
5. మొహ్మద్ సయ్యద్ సాదుల్లా
6. కె.ఎం మున్షీ

ముఖ్యమైన పాయింట్స్

రాజ్యాంగ రచన కమిటీని ఆగస్టు 29, 1947న ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ తన నివేదికను పరిషత్‌కు ఫిబ్రవరి 21, 1948న సమర్పించింది.
రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షలు ఖర్చు అయింది.
భారత రాజ్యాంగ చిహ్నం ఏనుగు
నవంబర్ 26, 1949న రాజ్యాంగ పరిషత్ చే రాజ్యాంగం ఆమోదించబడింది.
జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది.
పరిషత్ చివరి సమావేశం(11వది)జనవరి 24, 1950న నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్రపతిగా బాబు రాజేంద్రప్రసాద్ ఎన్నిక జరిగింది.
జాతీయ గీతం, జాతీయ గేయాన్ని ఆమోదించారు.

భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబర్ 26న ఆమోదించింది. ఇది జనవరి 26, 1950 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో మొదట 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి.

రాజ్యాంగ పరిషత్ నిర్మాణం
ప్రపంచంలో తొలి రాజ్యాంగ పరిషత్ అమెరికా.
ప్రపంచంలో రాజ్యాంగాన్ని పరిశోధించినది గ్రీకులు.
రాజ్యాంగ పితామహుడు / రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్
భారత ప్రజలు ప్రాంతీయ అసెంబ్లీల సభ్యులను ఎన్నుకున్నారు.
అసెంబ్లీల సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నకున్నారు.
ప్రాంక్ ఆంథోని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించాడు.

రాజ్యాంగ పరిషత్ సభ
సభ నిర్వహణకు తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా వ్యవహరించారు.
డిసెంబర్ 9, 1946న పరిషత్ తొలి సమావేశం నిర్వహించారు.
తొలి సమావేశానికి 211 మంది సభ్యులు హాజరయ్యారు.
డిసెంబర్ 11, 1946న రెండో సమావేశం నిర్వహించారు.
రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షడిగా బాబురాజేంద్ర ప్రసాద్ ఎన్నిక.
పరిషత్ ఉపాధ్యక్షులుగా ..1. హెచ్‌సీ ముఖర్జి 2. కృష్ణమాచారి ఎన్నిక.
డిసెంబర్ 1౩, 1946న మూడవ సమావేశం నిర్వహించారు.
మూడో సామావేశంలో నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మనం ప్రవేశ పెట్టారు.
ఈ తీర్మానం జనవరి 22, 1947న ఆమోదించబడింది. ఈ తీర్మానమే రాజ్యాంగ ప్రవేశకకు ఆదారం.

 

డా.బిఎస్‌ఎన్ దుర్గాప్రసాద్, డైరెక్టర్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News