Monday, December 23, 2024

మనిషి ఎలా బతక్కూడదనే దాన్ని చూపించారు

- Advertisement -
- Advertisement -

Ari telugu movie

అనసూయ ప్రధాన పాత్రలో జయశంకర్ దర్శకత్వంలో ఆర్వి రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా ఓ సినిమాని నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో విడుదలైంది. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ “ఈ సినిమాలో మానవత్వంతోపాటు మంచి వినోదం కూడా వుంది. మనిషి ఎలా బతక్కూడదనే విషయాన్ని వినోదాత్మకంగా దర్శకుడు చూపించారు” అని చెప్పారు. చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ “సినిమా టైటిల్ ‘అరి’ అనేది సంస్కృత పదం. దీనికి శత్రువు అని అర్థం. అది ఏమిటి? అనేది సినిమాలో చెప్పాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ రవిశంకర్, అనూప్ రూబెన్స్, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను, నిర్మాత శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News