Tuesday, December 24, 2024

మాస్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘షికారు’. శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పిఎస్‌ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందిం ది. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఇటీవలే చిత్ర యూనిట్ వైజాగ్ నుంచి నెల్లూరు వరకు రోడ్ ట్ట్రిప్ నిర్వహించింది. ప్రతిచోట యూత్ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆ విశేషాలను, చిత్ర విడుదల తేదీని తెలియజేస్తూ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేంలో హీరోయిన్ సాయిధన్సిక మాట్లాడుతూ… అందరి సమిష్టి కృషితో మంచి సినిమా చేశాము. మంచి కథతో ‘షికారు’ ద్వారా తెలుగువారి ముందుకు వస్తున్నా. దర్శకుడు నాకు అందమైన పాత్రను ఇచ్చారు అని తెలిపారు. దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ… నాకు గురువులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు సినిమాను విడుదల చేయడం ఆనందంగా వుంది. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా తీశాము. జూలై 1 ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము అని అన్నారు. ఈ సమావేశంలో జి. నాగేశ్వరరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్. రావు, ప్రసన్న కుమార్, బెక్కం వేణుగోపాల్, కొల్లి రామకృష్ణ, బాబ్జీ, నవకాంత్, ధీరజ్ ఆత్రేయ, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, షర్మిల తదితరులు పాల్గొన్నారు.

Actress Sai Dhanshika about Shikara Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News