Monday, December 23, 2024

ఆల్ట్‌న్యూస్ జర్నలిస్టు జుబైర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Alt‌news journalist Zubair arrested

న్యూఢిల్లీ : వెబ్‌సైట్ అల్ట్‌న్యూస్ వ్యవస్థాపకులలో ఒక్కరైన జర్నలిస్టు మహమ్మద్ జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిజనిర్థారణ సంబంధిత ఈ వెబ్‌సైట్ జర్నలిస్టు తమ వ్యాఖ్యలతో మతపరమైన ఉద్విగ్నతలకు పాల్పడ్డారని, విద్వేషాలను రెచ్చగొట్టారనే అభియోగాలపై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 2018లో ఆయన తమ ట్వీటు వెలువరించారు. ఓ మతానికి సంబంధించిన ప్రతీకను కించపరిచేలా జుబైర్ ఓ చిత్రాన్ని పొందుపర్చినట్లు ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది. ఎటువంటి నోటీసు లేకుండానే ఆయనను అరెస్టు చేశారని ఈ వెబ్‌సైట్ నిర్వాహకులలో ఒకరైన ప్రతీక్ సిన్హా విమర్శించారు. వేరే కేసుకు సంబంధించి విచారణకు పిలిపించి పోలీసులు అరెస్టుకు పాల్పడినట్లు ఆరోపించారు. ఆయనను ఎందుకు అరెస్టు చేశారో కారణాలు తెలియచేయాలని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News