Friday, December 20, 2024

ఇంగ్లండ్ టీమ్ ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

Bunny Vasu interview about Pakka Commercial Movie

లండన్: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చారిత్రక విజయం సాధించిన ఇంగ్లండ్ టీమ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్ భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించి విజయాలను అందుకుంది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, ప్రధాన కోచ్ బ్రెండన్ మెకొల్లమ్‌ల పర్యవేక్షణలో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. జానీ బెయిర్‌స్టో, జో రూట్, కెప్టెన్ స్టోక్స్‌లు అసాధారణ ఆటతో అలరించారు. ఇక చిరస్మరణీయ విజయాన్ని సాధించిన ఇంగ్లండ్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ ప్రదర్శన టెస్టు క్రికెట్‌కు కొత్త దారి చూపించిందని వారు కొనియాడారు.

England Clean Sweep Test Squad against New Zealand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News