Monday, January 20, 2025

ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదుర్స్

- Advertisement -
- Advertisement -

ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ముందంజలో బాలికలు
ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం
ఉత్తీర్ణత అగ్ర స్థానంలో నిలిచిన మేడ్చల్ జిల్లా సైన్స్
గ్రూపుల్లో అత్యధిక ఉత్తీర్ణత ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్
సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడులయ్యాయి. మంగళవారం నాం పల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో వి ద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ, ఇంటర్ మొదటి, రెం డో సంవత్సరం కలిపి మొ త్తంగా రాష్ట్ర వ్యా ప్తంగా 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారి లో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం లో 63.32 శాతం,రెండో సంవత్సరంలో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపా రు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,64,892 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,94,378 మంది ఉత్తీర్ణులయ్యారని, 63.32 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 4,42,895 మంది పరీక్షలు రాయగా, 2,97,458 మంది ఉత్తీర్ణులయ్యారని, 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.

బాలికలదే పైచేయి

ఇంటర్ ఫలితాలలో ఎప్పటిలాగే బాలికలు ముందంజలో ఉన్నారు. మొదటి సంవత్సరంలో బాలికలు 72.33 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించగా, బాలురు 54.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండవ సంవత్సరంలోనూ కూడా 75.28 శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉండగా, బాలుర ఉత్తీర్ణత 59.21 శాతంగా నమోదైంది. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 63.32 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 72.33 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 67.16 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 75.28 శాతం నమోదైంది. అలాగే ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,09,587 మంది పరీక్షలకు హాజరుకాగా, 1,52,757(72.88 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఒకేషనల్‌లో 23,623 మంది బాలికలు హాజరు కాగా, 15,935(67.45 శాతం) శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,14,380 మంది హాజరుకాగా, 2,68,763 మంది (64.85 శాతం) ఉత్తీర్ణత సాధించగా, ఒకేషనల్‌లో మొత్తం 50,512 మందికి 25,615 మంది(50.70 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో జనరల్‌లో 3,92,258 మంది పరీక్షలకు హాజరు కాగా, 2,69,431 (68.68 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 44,112 మంది హాజరుకాగా, 26,518 మంది (60.12 శాతం) ఉత్తీర్ణత నమోదైంది.

అత్యధిక విద్యార్థులకు ఎ గ్రేడ్

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్‌లో 1,76,992 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 55,262 మంది బి గ్రేడ్, 24,330 మంది సి గ్రేడ్, 12,179 మంది డి గ్రేడ్ సాధించారు. అలాగే ఒకేషనల్‌లో 16,933 మంది విద్యార్థులు ఎ గ్రేడ్, 8,239 మంది బి గ్రేడ్, 417 మంది సి గ్రేడ్, 26 మంది డి గ్రేడ్ సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 1,44,076 మంది ఎ గ్రేడ్ సాధించగా, ప్రైవేట్‌లో 10 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించారు. రెగ్యులర్‌లో 72,186, ప్రైవేట్‌లో 20 మంది బి గ్రేడ్, రెగ్యులర్‌లో 35,018 మంది, ప్రైవేట్‌లో 15 మంది సి గ్రేడ్, రెగ్యులర్‌లో 18,151 మంది, ప్రైవేట్‌లో 11 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్‌లో రెగ్యులర్‌లో 15,346 మంది ఎ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్‌లో 10,295, సి గ్రేడ్‌లో 796, డి గ్రేడ్‌లో 81 మంది ఉత్తీర్ణత సాధించారు.

ప్రథమ స్థానంలో మేడ్చల్ జిల్లా

రాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో 74 శాతం ఉత్తీర్ణతతో హనుమకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అలాగే రెండో సంవత్సరం ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 77 శాతం ఉత్తీర్ణతతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. ప్రథమ సంవత్సరంలో మెదక్ జిల్లాలో అత్యల్పంగా 40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాలలోనూ 47 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

ఎంపిసిలో అత్యధిక ఉత్తీర్ణత

ఇంటర్ ఫలితాలలో ఈ సారి ఎంపిసి గ్రూప్‌లో అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరం ఎంపిసి గ్రూప్‌లో మొత్తం 1,22,676 మంది విద్యార్థులు(76.3 శాతం) ఉత్తీర్ణులు కాగా, ద్వితీయ సంవత్సరంలో 1,24,248 మంది(79.6 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బైపిసి గ్రూప్‌లో మొదటి సంవత్సరంలో 81,193 మంది(71.9 శాతం) ఉత్తీర్ణులు కాగా, రెండో సంవత్సరంలో 76,032 మంది(75.3 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే సిఇసి గ్రూప్‌లో మొదటి సంవత్సరంలో 48,592 మంది(44.4 శాతం) ఉత్తీర్ణత నమోదు కాగా, రెండో సంవత్సరంలో 48,937 మంది(47.7 శాతం) ఉత్తీర్ణులయ్యారు. హెచ్‌ఇసిలో ప్రథమ సంవత్సరంలో 3,964 మంది(31.8 శాతం), ద్వితీయ సంవత్సరంలో 4,899 మంది(45.7 శాతం) ఉత్తీర్ణులు కాగా, ఎంఇసి గ్రూపులో ఫస్టియర్‌లో 11,828 మంది(64.7 శాతం), సెకండియర్‌లో 14,761 మంది(69.4 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

సత్తా చాటిన సర్కారు కాలేజీలు

ఇంటర్ ఫలితాలలో సర్కారు కాలేజీలు సత్తా చాటాయి. మొదటి సంవత్సరంలో ప్రభుత్వ కాలేజీలో 47.70 శాతం, గురుకులాల్లో 73.30 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రైవేట్ కాలేజీల్లో 66.50 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే రెండో సంవత్సరంలో గవర్నమెంట్ కాలేజీల్లో 63.56 శాతం, గురుకులాల్లో 78.25 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రైవేట్ కాలేజీల్లో 68.30 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

వచ్చే 6లోగా రీకౌంటింగ్‌కు ఫీజు చెల్లించాలి

ఇంటర్ మార్కుల రీ కౌంటింగ్, జవాబుపత్రాల రీ వెరిఫికేషన్ కోసం జులై 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలి. www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో స్టూడెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్ ద్వారా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు విద్యార్థులు ఫీజు చెల్లించాలి.

ఆగస్టు 1 నుండి అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలలో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తామని అన్నారు. ఫెయిలైన విద్యార్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు.

అమ్మాయిలే హవా

ఇంటర్ మొదటి సంవత్సరం..

పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,64,892

ఉత్తీర్ణత సాధించినవారు: 2,94,378

ఉత్తీర్ణత శాతం: 63.32 శాతం

పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,33,210

ఉత్తీర్ణత సాధించినవారు: 1,68,692

ఉత్తీర్ణత శాతం: 72.33

పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,31,682

ఉత్తీర్ణత సాధించినవారు: 1,25,686

ఉత్తీర్ణత శాతం: 54.25 శాతం

ఇంటర్ ద్వితీయ సంవత్సరం..

పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,42,895

ఉత్తీర్ణత సాధించినవారు: 2,97,271

ఉత్తీర్ణత శాతం: 67.16 శాతం

పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,19,271

ఉత్తీర్ణత సాధించినవారు: 1,65,060

ఉత్తీర్ణత శాతం: 75.28

పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,23,624

ఉత్తీర్ణత సాధించినవారు: 1,32,398

ఉత్తీర్ణత శాతం : 58

ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల సేవలు

ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఒత్తిడి నివారణకు ఇంటర్ బోర్డు ఏడుగురు క్లినికల్ సైకాలజిస్టులను నియమించింది. మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు ఫోన్‌లో సైకాలజిస్టులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.

సైకాలజిస్టు పేరు ఫోన్ నెంబర్

1.డాక్టర్ అనిత 949129159

2.డాక్టర్ మజల్ అలీ 9491265299

3. డాక్టర్ రజిని 9491273876

4.పి. జవహార్‌లాల్ నెహ్రూ 9491307681

5.ఎస్.శ్రీలత 9491321197

6.శైలజ పిసపాటి 9491338909

7.అనుపమ గుట్టిమ్‌దేవి 9491265503

8. సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ 9491279203

9. సరోజ 9491296096

10. టోల్ ఫ్రీ నెంబర్ 18005999333

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News