ముంబై: అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) తమ వార్షిక ఫిర్యాదుల నివేదికను ఏప్రిల్ 2021 –మార్చి 2022 మధ్యకాలానికి విడుదల చేసింది. ఈ కాలంలో ఇది 5,532 ప్రకటనలను ప్రింట్, డిజిటల్, టెలివిజన్ మాధ్యమాలలో పరిశీలించింది. డిజిటల్ విభాగంపై అధికంగా దృష్టి సారించడంతో పాటుగా మొత్తంమ్మీద 94% ప్రకటనలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లుగా ఆస్కీ గుర్తించింది.
గత సంవత్సరంతో పోలిస్తే 202–22లో ఆస్కీ ఏకంగా 62% అధిక ప్రకటనలను మరియు 25% అధిక ఫిర్యాదులను ప్రాసెస్ చేసింది. టెలివిజన్ మరియు ప్రింట్ యాడ్స్ అధికంగా దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ఆస్కీ అత్యధికంగా డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో ముందుగానే ప్రకటనలను పర్యవేక్షించడం ద్వారా దాని పరిధిని విస్తృతం చేసింది. ఆస్కీ ప్రాసెస్ చేసిన మొత్తం ప్రకటనలలో దాదాపు 48% యాడ్స్ డిజిటల్ మాధ్యమానికి చెందినవి. గత సంవత్సరం ఇన్‌ఫ్లూయెన్సర్ మార్గదర్శకాలు అమలులోకి రావడంతో, ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఫిర్యాదులు మొత్తం ఫిర్యాదులలో 29%గా నమోదయ్యాయి. ప్రకటనలలో సెలబ్రిటీలు కనిపిస్తూ తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్న ప్రకటనల పరంగా ఫిర్యాదులలో 41% వృద్ధి కనిపించింది. వీటిలోనూ 92% ఫిర్యాదులలో ఆస్కీ యొక్క మార్గదర్శకాల అతిక్రమణ జరిగిందని వెల్లడైంది.
ఆస్కీ చురుగ్గా తమ నిఘాను కొనసాగిస్తుంది మరియు ప్రాసెస్ చేయబడిన ప్రకటనలలో 75%ను సు–మోటోగా ఎంపిక చేసింది. దీనిలో డిజిటల్ ట్రాకింగ్ కోసం ఆస్కి ఏర్పాటుచేసిన ఏఐ ఆధారిత పర్యవేక్షణ కూడా భాగంగా ఉంది. మొత్తం ఫిర్యాదులలో 21% ఫిర్యాదులు వినియోగదారుల నుంచి వస్తే , దీనిని అనుసరించి పరిశ్రమఅంతర్గతంగా 2% ఉన్నాయి. అలాగే సీఎస్‌ఓ/ ప్రభుత్వ ఫిర్యాదులు 2% ఉన్నాయి. మొత్తం 5,532 యాడ్స్‌ను ప్రాసెస్ చేస్తే 39% ప్రకటనలను ఎడ్వర్టయిజర్లు వివాదంగా భావించలేదు. ఈ ప్రకటనలలో 55% అభ్యంతరకరమైనవని పరిశోధన తరువాత తేలింది. ఇక 4% ప్రకటనలను ఆస్కీ నిబంధనలకు లోబడి ఉన్న కారణంగా వాటి మీద ఉన్న అభ్యంతరాలను తోసి పుచ్చారు. ఆస్కీ ప్రాసెస్ చేసిన 94%ప్రకనటలను మార్చాల్సి ఉంది. తద్వారా అవి ఆస్కీ కోడ్‌ను అతి క్రమించినట్లుగా చూడరు.
డిజిటల్ పర్యవేక్షణ, అభివృద్ధి చెందుతున్న రంగాలలో తమ దృష్టికి అనుగుణంగా నూతన విభాగాలైనటువంటి వర్ట్యువల్ డిజిటల్ ఆస్తులు, ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ వంటివి జోడించడం జరిగింది. వీటిలో అభ్యంతరకర ప్రకటనలు 8%గా ఉన్నాయి వాటిలోనూ విద్య(33%), ఆరోగ్య సంరక్షణ 16%, వ్యక్తిగత సంరక్షణ 11%లు అగ్రశ్రేణి మొదటి ఉల్లంఘన విభాగాలుగా ఉన్నాయి.
తమ ఫిర్యాదుల వ్యవస్థ ‘తార’ను ఆస్కీ ఆధునీకరించడంతో పాటుగా వినియోగదారులతో పాటుగా ప్రకటనకర్తలకు ఫిర్యాదుల నిర్వహణ , పరిష్కారాలలో సౌకర్యవంతమైనఅనుభవాలు అందిస్తుంది. ఫిర్యాదులను వాస్తవ సమయంలో ట్రాకింగ్ చేయడం, సమకాలీన సాంకేతిక వేదికలపై ఎలాంటి అంచనాలు ఉంటాయో అదే తరహా అనుభవాలను పొందేందుకు తగిన ఫీచర్లను సైతం అందిస్తుంది.
ఈ వార్షిక నివేదిక గురించి ఆస్కీ ఛైర్మన్ సుభాష్‌కామత్ మాట్లాడుతూ ‘‘2021–22 అనేది ప్రకటనల వ్యవస్ధలో ఆధిపత్యం చెలాయించే విధంగా డిజిటల్ మీడియాను ఎక్కువగా పర్యవేక్షిస్తామన్న మా వాగ్ధానాన్ని మేము అనుసరించిన సంవత్సరం. సాంకేతికతలో భారీ పెట్టుబడులను మేము పెట్టాము. ఇది చాలా చక్కటి తోడ్పాటును అందించింది. అంతేకాకుండా మా ఫిర్యాదుల వ్యవస్ధను సైతం మేము ఆధునీకరించాము. వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదుచేయడాన్ని ఇది అతి సులభతరం చేయడంతో పాటుగా ప్రకటనకర్తలు దీనికి స్పందించడమూ చేసేలా తోడ్పడుతుంది. మరింత ముందుకు వెళ్తే, మేము మరింత వేగంగా ప్రతిస్పందించేలా చేయడానికి, క్రియాశీలంగా మారడానికి మా ప్రక్రియలను క్రమబద్దీకరిస్తున్నప్పటికీ డిజిటల్ హద్దులను నియంత్రించడం మరియు పర్యవేక్షించడంలో ముందున్నాం’’ అని అన్నారు
ఈ వార్షిక నివేదిక గురించి ఆస్కీ సీఈఓ –సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ మాట్లాడుతూ ‘‘ఆస్కీ బృందం, కన్స్యూమర్ ఫిర్యాదుల మండలి, గౌరవనీయ మాజీ హైకోర్టు న్యాయమూర్తులు మా రివ్యూ ప్యానెల్‌లో ఉన్నారు మరియు మా డొమైన్ నిపుణులు ప్రకటనల యొక్క సూక్ష్మ భేదాలు మరియు వేలాది ప్రకటనల శాస్త్రీయ ఆధారాలు చర్చించడంతో పాటుగా ఈ ప్రక్రియ, ఫలితాలు వినియోగదారులు మరియు ప్రకటనదారులకు న్యాయబద్దంగా ఉన్నాయని నిర్థారిస్తుంది. అదే సమయంలో, మా కోడ్‌ను నిరంతరం అప్‌డేట్ చేయడం వల్ల నూతన, అభివృద్ధి చెందుతున్న ఫార్మాట్లు, విభాగాలలో వినియోగదారులతో పాటుగా ప్రకటనకర్తలకు సైతం పారదర్శకతను అందిస్తామనే భరోసా అందిస్తుంది. ఇది ప్రకటనల రంగంలో అభివృద్ధి కోణంలో స్వీయ నియంత్రణకు సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు.
ASCI Releases Annual Complaints Report 2021-22