కాంతి వేగంతో పోలిస్తే ధ్వనివేగం అతి స్వల్పం. అందువల్ల మెరుపు మెరిసిన కాద్దిసేపటికీ ఉరుము వినిపిస్తుంది.
వివిధ పదార్థాల ధ్వనివేగం
రబ్బర్‌తో పోలిస్తే ఉక్కు స్థితిస్థాపకత ఎక్కువ కాబట్టి రబ్బరులో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది.
ద్రవ, వాయు పదార్థాలలో ధ్వని తిర్యక్ తరంగాల రూపంలోను, గాలిలో అనుదైర్ఘ తరంగాల రూపంలోనూ ప్రయాణిస్తుంది.
తొలిసారిగా గాలిలో ధ్వని వేగాన్ని ప్రయోగాత్మకంగా అమెరికా శాస్త్రవేత్త మిల్లర్ నిర్దారించారు.
ధ్వని వేగం ఘనపదార్థాల్లో గరిష్టంగా, ద్రవపదార్థాల్లో సాధారణంగా, వాయు పదార్థాల్లో కనిష్టంగా ఉంటుంది.
అనునాదం
సమాన సహజ పౌనః పున్యాలు ఉన్న రెండు వస్తువుల్లో మొదటి వస్తువును కంపింప చేస్తే దాని ప్రభావం వల్ల రెండోవస్తువు గరిష్ట శబ్దతీవ్రతతో కంపిస్తుంది. దీనినే అనునాదం అంటారు.
ఉదా: పిల్లన గ్రోవి, రేడియో, ఈల అనునాదం ఆధారంగా పనిచేస్తాయి.
వంతెన (బ్రిడ్జి)లపై సైనికులను సాధారణ నడకతో దాటమంటారు. దీనికి కారణం కవాతు చేస్తూ నడిస్తే, కవాతు పౌనఃపున్యం, వంతెన పౌనఃపున్యం సమానమై అనునాదంతో వంతెన కంపన పరిమితి అధికమై వంతెన కూలిపోయే ప్రమాదముంది.
ఒక వేళ బ్రిడ్జి కిందనీరు ప్రవహిస్తే దాని సహజ పౌనఃపున్యం మారడం వలన అనునాదం ఏర్పడదు. కావున బ్రిడ్జి కూలదు.
బాంబు పేలినప్పుడు దానికి దగ్గరలో ఉన్న ఇల్లు కూలిపోవడం లేదా బీటలు రావడం జరుగుతుంది.
విమానాలు ప్రయాణిస్తున్పప్పుడు గృహాల కిటికీలు కొద్దిగా కంపించడానికి కారణం అనునాదం
సహజ కంపనాలు
ఒక వస్తువును కంపింపజేసి వదిలినప్పుడు అది చేసే కంపనాలను సహజకంపనాలు అంటారు.
బలాత్కృత కంపనాలు: బాహ్య ఆవర్తనాల కంపనాల ప్రభావంతో కంపించడాన్ని బలాత్కృత కంపనాలు అంటారు.
అవరుద్ధ కంపనాలు
కాలంతో ఆగిపోయే కంపన పరిమితులున్న కంపనాలను అవరుద్ద కంపనాలు అంటారు.
కరెంట్ అఫైర్స్
బంగ్లాలో అతి పొడవైన రోడ్డు, రైలు వంతెన ప్రారంభం
బంగ్లాదేశ్‌లో నిర్మించిన అతి పొడవైన వం తెనను ప్రధాని షేక్ హసీనా ప్రారంభించా రు. పద్మానదిపై 6.15 కి.మీల పొడవునా ఈ రోడ్ రైలు వంతెనను నా లుగు లైన్లలో నిర్మించారు. నైరుతి బంగ్లాదేశ్‌లో ర వాణా.. ఢాకా, ఇతర ప్రాంతాలను కలిపే ఈ వం తెనకు ప్రభుత్వం 3.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. బంగ్లాదేశ్ సొంత నిధులతో నిర్మించిన ఈ వంతెన దేశానికి గర్వకారణమని హసీనా అన్నారు.
బైడెన్‌కు సైన్స్ సలహాదారుగా ఆర్తీ ప్రభాకర్
ప్రముఖ ఇండో అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్తీ ప్రభాకర్(63)ను తనకు సైన్స్ సలహాదారుగా కీలక స్థానం లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకం అం టూ ఇండో అ మెరికన్ వర్గం ప్రశంసించింది. వైట్ హౌజ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాల య (ఓఎస్‌టీపీ) తొలి మహిళా (వలసదారు) డైరెక్టరుగా ఆర్తీ ప్రభాకర్ చరిత్ర సృష్టించనున్నారు.
దక్షిణ కొరియా తొలి రాకెట్ ప్రయోగం విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష రాకెట్‌ను దక్షిణ కొరియా విజయవంతంగా ప్రయోగించింది. దీని సాయంతో ఒక ఉపగ్రహాన్ని కక్షలోకి పంపింది. తద్వారా రోదసిశక్తిగా ఎదగాలన్న లక్షంతో తొలి అడుగులు పడ్డాయి. స్వీయ సామర్థంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన 10వ దేశంగా దక్షిణ కొరియా గుర్తింపు పొందింది. తాజాగా ప్రయోగించిన రాకెట్ పేరు సురి. ఇందులో మూడు దశలు ఉన్నాయి. దీని పొడవు 47 మీటర్లు. ఇది ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని 700 కి.మీ ఎత్తులో ఉన్న కక్షలో ప్రవేశపెట్టింది.
కేరళలో అతిపెద్ద టాటా సౌర విద్యుత్ ప్రజెక్టు ప్రారంభం
టాటా పవర్‌కు చెందిన అనుబంధ సంస్థ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపింది. 101.6 మెగావాట్ల గరిష్ఠ సామర్థంతో కేరళ బ్యాక్‌వాటర్స్‌లో దీనిని నెలకొల్పినట్లు పేర్కొంది. కాయమ్‌కులమ్‌లోని వాటర్‌బాడిలో 350 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును స్థాపించినట్లు కంపెనీ వెల్లడించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పం ద విభాగంలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్ ప్రాజెక్టు ఇదేనని టాటా పవర ఎండీ ప్రవీర్ సిన్హా వెల్లడించారు.
ఐబి డైరెక్టర్‌గా తపన్‌కుమార్ డేకా
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపిఎస్ అధికారి తపన్‌కుమార్ డేకా నియమితులయ్యా రు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న 1984 అ స్సాం క్యాడర్ ఐపిఎస్ అధికారి అరవింద్ కుమార్ పదవీ కాలం పూర్తవడంతో డేకాను నియమిస్తూ కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్‌గా దినకరన్ గుప్తా
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ పంజాబ్ మాజీ డిజిపి, ఆ రాష్ట్రంలోని 1987 కే డర్ ఐపిఎస్ అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారా లు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31, 2024 వరకూ ఆ హోదాలో కొనసాగుతారు.
ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్
ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కంబోజ్ నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న టి.ఎస్.తిరుమూర్తి స్థానంలో ఆమె బాధ్యతలు చెపట్టనున్నారు. ప్ర స్తుతం ఆమె భూటాన్‌లో భారత రాయబారిగా ఉన్నారు.
మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2022 విజేతగా ఖుషీ పటేల్
బ్రిటన్‌కు చెందిన బయో మెడికల్ విద్యార్థి ఖుషీ ప టేల్ మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2022 విజేతగా నిలిచారు. భారత్ బయట 29 ఏళ్లుగా ఈ అందా ల పోటీలను నిర్వహిస్తున్నారు. విజేతలను ఇం డియా ఫెస్టివల్ కమిటి ప్రకటించింది. అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్‌గాను, శ్రు తికా మనే రెండో రన్నరప్‌గాను ఎంపికయ్యారు.
ధ్వని వెలువడే సందర్భం ధ్వనితీవ్రత (డి.బి)
కనురెప్పలు కదిలినప్పుడు 0
గుసగుసలాడినప్పుడు 15- – 20
గోడగడియారంలోని లోలకం 30
సాధారణ సంభాషణ 50 80
టెలిఫోన్ రింగ్ 60
చెవికి ప్రమాదకరమైన ధ్వని 85
ట్రాఫిక్‌లో ధ్వని 80 90
చెవుపోటుకి కారణమయ్యే ధ్వని 120
ఉరుము 150
జిఎస్‌ఎల్‌వి నుండి
విడుదలయ్యే ధ్వని 250
ఆవిష్కరణలు
టేప్ రికార్డర్ ఆవిష్కర్త పాల్సన్
సిడి ఆవిష్కర్త సోని, ఫిలిప్స్
కాంతి విద్యుత్ ఫలితం హెన్రిచ్ రాడాల్ఫ్ హెర్ట్
కాంతి విద్యుత్ ఫలితం వివరణ అల్బర్ట్ ఐన్‌స్టీన్
ఆడియోగ్రాఫ్ ధ్వనిని రికార్డింగ్ చేయడం
వీడియోగ్రఫీ కాంతిని రికార్డింగ్ చేయడం.
పరికరాలు కనుగొన్న వ్యక్తులు
ల్యాండ్‌లైన్ ఫోన్ అలెగ్జాండర్ గ్రహంబెల్
మొబైల్ ఫోన్ మార్టిన్ కూపర్
హైడ్రోఫోన్ రూథర్ ఫర్డ్
క్యాలిక్యులేటర్ పాస్కల్
కంప్యూటర్ చార్లెస్ బాబేజ్
(కంప్యూటర్ పితామహుడు)
డైనమో మైఖేల్ ఫారడే
ఎలక్ట్రిక్ బల్బ్ థామస్ అల్వాఎడిసన్
ఆప్టికల్ ఫైబర్ నరేంద్రసింగ్ కపాని
విమానం రైట్ బ్రదర్స్
హెలికాప్టర్ బ్రాకేట్
న్యూక్లియర్ రియాక్టర్ ఫెర్మి
రేడియో మార్కోని
టెలివిజన్ జెఎల్ బయర్డ్
లిఫ్ట్ ఓటిస్
టెలిస్కోప్ గెలీలియో
ధర్మామీటర్ గెలీలియో
భారమితి టారిసెల్లి
వైటెనింగ్ డిటెక్టర్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్
అణుబాంబు ఓపెన్ హైమర్
హైడ్రోజన్ బాంబు ఎడ్వర్ట్ టెల్లర్
ధర్మాస డివేర్
సైకిల్ మిక్‌మిలాన్
బాల్‌పెన్ జేజే. బాండ్
ఫౌంటెన్‌పెన్ వాటర్‌మాన్
పెట్రోల్‌కారు కార్లివెంజ్
రైలు ఇంజన్ స్టీవెన్‌సన్
జలాంతర్గామి బుష్‌నెల్
ఎయిర్ కండీషనర్ కొరియర్
సేఫ్టీ రేజర్ జిల్లెట్
రాడార్ వాట్సన్