న్యూయార్క్ : ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. వారు వ్యక్తపర్చిన విషయాలపై వారిని జైలు పాలు చేయొద్దని సూచించారు. “ ఈ ప్రపంచంలో ఏ ప్రదేశంలో అయినా ప్రజలు తమ భావాలను వ్యక్తపరిచేందుకు తగిన వాతావరణం ఉండాలన్నది నా అభిప్రాయం. వారి రాతలు, ట్వీట్లు, మాటలపై పాత్రికేయుల్ని జైల్లో పెట్టకూడదు. వారికి బెదిరింపులు లేని వాతావరణం ఉండాలి. ఈ మాట ఈ గదితో సహా ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది” అని గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ అన్నారు. జుబైర్ అరెస్టును లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర స్వతంత్ర సంస్థ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టు (సీపీఏ ) తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టు .. భారత పత్రికా స్వేచ్ఛ కనిష్ఠ స్థాయిని సూచిస్తోంది. మతపరమైన సమస్యలపై రిపోర్టింగ్ చేసే సభ్యులకు ప్రభుత్వం సురక్షితంగా లేని , ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది” అంటూ విమర్శించింది.
పాత్రికేయుల్ని అరెస్టు చేయొద్దు : ఐరాస సూచన
- Advertisement -
- Advertisement -
- Advertisement -