Monday, January 20, 2025

రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు

- Advertisement -
- Advertisement -

rain forecast for next 3 days in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం నుంచి సుమారు 19 డిగ్రీల అక్షాంశం వెంబడి ఉత్తర ద్వీపకల్పం భారతదేశం అంతటా ఉన్న షీర్ జోన్ బుధవారం బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. తూర్పు, పడమర ద్రోణి బుధవారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి, స్థిరంగా కొనసాగుతోందని అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News