Monday, December 23, 2024

ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్ డే’. ఈ చిత్రాన్ని ‘మత్తువదలరా’ ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ.

‘హ్యాపీ బర్త్ డే’ కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బ్లాక్‌బస్టర్‌గా ఉంది”అని అన్నారు. దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ “నా మొదటి చిత్రం టీమ్‌తోనే మళ్లీ పనిచేశాను. దాని కంటే ఈ సినిమాలో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్, డబుల్ థ్రిల్ ఉంటుంది. థియేటర్‌లో హ్యాపీ బర్త్ డే సినిమా చూసి ఎంజాయ్ చేయండి”అని తెలిపారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ “నేను ఈ తరహా సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నా క్యారెక్టర్ పూర్తిగా కొత్తగా ఉంటుంది”అని చెప్పారు. నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ “జాతి రత్నాలు మూవీని ఎలా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని అలాగే ఆస్వాదిస్తారు. లావణ్య త్రిపాఠీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చెర్రి, సురేష్ సారంగం, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

HAPPY BIRTHDAY Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News