Monday, December 23, 2024

చరిత్రలోనే తొలిసారి

- Advertisement -
- Advertisement -

Rupee fell below 79 against dollar for first time in history

79కి పడిపోయిన రూపాయి

న్యూఢిల్లీ : కరెన్సీ మార్కెట్‌లో రూపాయి చారిత్రాత్మక పతనాన్ని చూసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రంలోనే మొదటిసారిగా 79 దిగువకు పడిపోయింది. బుధవారం భారతీయ కరెన్సీ 19 పైసలు పడిపోయి రూ.79.04 వద్ద ముగిసింది. గత ఆరు రోజులుగా రూపాయి విలువ పతనమవుతూనే ఉంది. రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి విలువ చేరుకుంది. ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి కారణాల వల్ల రూపాయి పతనం కొనసాగుతోంది. ఇంటర్‌బ్యాంక్ కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.86 వద్ద ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత కనిష్ట స్థాయి 79.04కి పడిపోయింది. ఈ ఏడాది రూపాయి 5.8 శాతానికి పైగా పడిపోయింది. 2022 ఫిబ్రవరి 23న ఉక్రెయిన్ష్య్రా యుద్ధం ప్రారంభమయ్యే ముందు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 74.62 వద్ద ఉంది. అయితే రాబోయో రోజుల్లో రూపాయి మారకం విలువ 80 స్థాయికి పడిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కట్టడికి ఆర్‌బిఐ చర్యలు

విదేశీ మారక నిల్వల డిమాండ్‌ను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్‌బిఐ ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాల కారణంగా కరెన్సీ మార్కెట్లో డాలర్ కొరత వేగంగా పెరుగుతోంది. మరోవైపు డాలర్‌కు డిమాండ్ పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారత మార్కెట్‌లో 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ జూలైలోనూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచాలని నిర్ణయించింది. ఈ ఆందోళనల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. డాలర్‌తో రూపాయి పతనం భారతదేశం ఇబ్బందులను పెంచనుందని నిపుణులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News