Monday, December 23, 2024

బలపరీక్షకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా!

- Advertisement -
- Advertisement -
Uddhav Thakrey
మళ్లీ సీఎం కానున్న దేవేంద్ర ఫడ్నవీస్ 

ముంబై: దాదాపు తొమ్మిది రోజుల రాజకీయ సంక్షోభం తర్వాత, మహా వికాస్ అఘడి ప్రభుత్వం తుదకు బుధవారం సాయంత్రం పడిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఆయన శివసేన-నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) కాంగ్రెస్ పార్టీల సంకీర్ణం ఎంవిఏ ప్రభుత్వంకు అధినేతగా కొనసాగారు. సుప్రీంకోర్టు గురువారం బలపరీక్ష(ఫ్లోర్ టెస్ట్)కు ఆదేశించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఠాక్రే రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశియారి ఆమోదించడమే కాక, తదుపరి ఏర్పాటు జరిగే వరకు ఆయనను కొనసాగాల్సిందిగా కోరారు. దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News