- Advertisement -
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అని బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. షిండేనే శివసేన శాసనసభపక్షనేతగా బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. షిండే ప్రభుత్వానికి బిజెపి బయటినుంచి మద్దతు ఇచ్చిన ముచ్చట తెలిసిందే. రెబల్స్ ఆధ్వర్యంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాత్రి 7:30 గంటలకు సిఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరుగుబాటులో చాలా మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన వారం రోజుల డ్రామాకు తెరపడింది.
- Advertisement -