Saturday, December 21, 2024

నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi to stay in Novotel

భారీగా భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ బసపై నెలొకన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రధాని మోడీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని తొలుత భావించారు. అయితే రాజ్‌భవన్ నుంచి హెచ్‌ఐసిసి వరకు ప్రధాని రాకపోకలు సాగించడం భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారతాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌ను మోదీ బస కోసం పరిశీలించారు. చివరగా అక్కడే మోడీ బస ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కూడా అనుమతించింది. ఇక జులై 2,3,4 తేదీల్లో ప్రధాని నోవాటెల్ హోటల్‌లోనే బస చేయనున్నారు. ప్రధాని మోడీ బస కోసం ఆ హోటల్‌లో ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వు చేసినట్లు తెలిసింది.

హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోడీ జులై 2,3 తేదీల్లో హెచ్‌ఐసిసిలో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. జులై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బిజెపి బహిరంగ సభకు హాజరుకానున్నారు. జులై 4వ తేదీన హైదరాబాద్ నుంచే ప్రధాని మోడీ ఎపిలో భీమవరం బయల్దేరి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇక, బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హెచ్‌ఐసిసి పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు. సమావేశాలు జరగనున్న హెచ్‌ఐసిసితో పాటు ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు బస చేసే హోటళ్లను భద్రత బలగాలు వారి ఆధీనంలోకి తీసుకున్నాయి.

అగ్నిపథ్ పథకాన్కి వ్యతిరేకంగా ఇటీవల నిరసనల దృష్టా సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచారు. హెచ్‌ఐసిసికి ఐదు కిలోమీటర్ల మేర నో ప్లై జోన్‌గా ప్రకటించారు. గురువారం నుంచి జులై 3 వరకు నో ప్లై జోన్ ఆంక్షలు ఉండనున్నాయి. డ్రోన్లు, పారాగ్లైడింగ్ ఎగరడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అలాగే సైబరాబాద్ పరిధిలోని నోవాటెల్, హైదరాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్, రాజ్‌భవన్ పరిసరాల్లో నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో వుంటాయి. ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News