Friday, November 22, 2024

అఫీస్ బబుల్స్‌ను అందిస్తున్న ఎల్‌అండ్‌టీ మెట్రో

- Advertisement -
- Advertisement -

L&T Metro offering office bubbles

దాదాపు 0.4 మిలియన్ చదరపు అడుగుల ట్రాన్సిట్ ఓరియెంటెడ్ ఆపీస్ ప్రాంగణం అందుబాటులో
నగరంలో 49 టిపికల్ మెట్రో స్టేషనల్‌లో ప్రతిచోట రెండు యూనిట్లతో ఏర్పాటు

హైదరాబాద్: నగరంలో మెట్రోరైల్‌ను నిర్వహిస్తోన్న ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ విన్నూత నేపథ్యం ఆఫీస్ బబుల్స్‌ను ప్రారంభించింది. ఇది సురక్షితమైన, రిమోట్, కోవర్కింగ్ ప్రాంగణాలను తమ ట్రాన్సిట ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా అందిస్తుంది. బారతీయ మెట్రోరైల్ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. ఈఆపీస్ బబుల్స్ ద్వారా ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ ఇప్పడు నగరంలో వృద్ది చెందుతున్న కో వర్కింగ్ ప్రాంగణాల డిమాండ్ తీర్చడంతో పాటుగా హైదరాబాద్‌లో ఆఫీస్ ప్రాంగణాలకు లోకేషన్ ప్లెక్సిబిలిటీ సైతం అందిస్తుంది. మెట్రోరైల్‌కు చెందిన ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ అత్యున్నత నాణ్యత కలిగిన రవాణా వ్యవస్దతో పాటుగా ఆహ్లాదకరమైన ఆర్బన్ ప్రాంగణాలను సృష్టిస్తున్నాయి. ఈ టిఓడి దాదాపు 18.5 మిలియన్ చదరపు అడుగుల ఆపీస్ ప్రాంగణాన్ని వర్క్, షాపింగ్, విశ్రాంత, వినోద, ఆరోగ్య సంరక్షణ అవసరాలను పార్కింగ్, సర్కులేషన్ ప్రాంతంలో అందిస్తుంది. ఐటీ కంపెనీలపై దృష్టి సారించి ఆపీస్ బబుల్స్ సృష్టించారు.

ఇది హబ్ అండ్ స్పోక్ నమూనాలో ఉంటుంది. నగరంలో దాదాపు 0.4 మిలియన్ చదరపు అడుగుల ప్రాంగణాన్ని ఆఫీస్ బబుల్స్‌కు లీజ్ కోసం కేటాయించారు. క్లయింట్స్ అవసరాలకనుగుణంగా ప్లగ్ అండ్ ప్లే, బేర్‌షెల్, వార్మ్‌షెల్ రూపంలో వీటిని అందిస్తున్నారు. ఎల్‌అండ్ మెట్రో రైల్ ఎండీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ భారతీయ నగర రవాణా రంగంలో మొట్టమొదటి సారిగా ఆపీస్‌బబుల్స్‌ను అందిస్తుండటం గర్వకారణంగా ఉందన్నారు. అత్యున్నతంగా అనుసంధానించబడి ఉండటంతో పాటుగా సురక్షితంగా ఉంటూనే ఆధారపడతగిన రిమోట్ కో వర్కింగ్ ప్రాంగణాలు కోరుకునే కార్పొరేట్ సహాయపడే రీతిలో ఈ ఆఫీస్ బబుల్స్ ఉంటాయని తెలిపారు. ఈకాన్సెప్ట్ సహజసిద్దంగా ఉండటం మాత్రమే కాదు స్టార్టప్స్‌కు లాజికల్ ఎంపికగా కూడా నిలుస్తుంది. అలాగే ఇది అందించే సౌకర్యం పరంగా కోవర్కింగ్ స్పేసెస్ వైపు వెళ్లాలనుకునే కార్పొరేట్ సంస్దలకు సైతం ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News