Saturday, November 23, 2024

గోల్కొండను సందర్శించిన నగర సిపి

- Advertisement -
- Advertisement -

బోనాల బందోబస్తుపై సమీక్ష
పూజలు నిర్వహించిన సిపి సివి ఆనంద్

మన తెలంగాణ, సిటిబ్యూరో: బోనాల సందర్భంగా గోల్కొండలోని శ్రీజగదాంబ మహంకాళీ టెంపుల్ వద్ద భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పర్యవేక్షించారు. వెస్ట్‌జోన్ డిసిపి నోయల్ డేవిస్‌తో కలిసి గురువారం టెంపుల్‌ను సందర్శించిన సిపి అక్కడి పూజారులు, అధికారులతో కలిసి అక్కడ ఏర్పాటు చేయాల్సిన బారీకేడ్లు తదితరాలపై సమీక్ష నిర్వహించారు. భోనాల సమయంలో కంట్రోల్ రూముతో సమన్వయం చేసుకోవాలని, ఎలాంటి ప్రకటనను అయినా కంట్రోల్ రూమ్ ద్వారా భక్తులకు చెప్పాలని ఆలయ అధికారులను కోరారు.

లంగర్‌హౌస్ ఎక్స్ రోడ్డు నుంచి గోల్కొండ వరకు శాంతిభద్రతలు, ట్రాఫిక్‌పై పర్యవేక్షణ చేశారు. గోల్కొండ భోనాలకు 800మంది పోలీసులను బందోబస్తుకు నియమించనున్నట్లు తెలిపారు. భోనాల రూట్‌లో 8 ప్లాటూన్ల టిఎస్‌ఎస్‌పి పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు. భోనాల్లో ఎక్కువగా మహిళా భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో షీటీమ్స్‌ను మఫ్టీలో నియమిస్తామని తెలిపారు. చైన్‌స్నాచర్లు, దొంగలపై అప్రమత్తంగా ఉండేందుకు అదనపు పోలీసులను మోహరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, డిసిపి నోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News