Monday, December 23, 2024

ఈఒడిబిలో తెలంగాణ అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

Telangana tops in EODB

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్గదర్శకాలు, నిబంధనల అమలు మేరకు జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం డిపిఐటిటి శాఖ ర్యాంకులు ప్రకటించిన సందర్భంగా ఉన్న అస్పష్టతను తొలగిస్తూ, ఈసారి కేవలం నాలుగు కేటగిరీల విభజించి రాష్ట్రాలకు వాటిని కట్టబెట్టింది ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ కేటగిరి టాప్ అచీవర్సులో తెలంగాణ స్థానం దక్కించుకున్నది. తెలంగాణ తో పాటు దేశంలోని పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు టాప్ అచీవర్స్ కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News