Saturday, November 16, 2024

సిఎం షిండే

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా
ఏక్‌నాథ్ ప్రమాణం

వ్యూహం మార్చిన బిజెపి అనూహ్యంగా షిండేకు పీఠం
నడ్డా సూచనతో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన
ఫడ్నవీస్ ఆటో డ్రైవర్ నుంచి సిఎం స్థాయికి షిండే

ముంబై: మహారాష్ట్రలో తొమ్మిది రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాధ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ప్రమాణస్వీకా రం చేశారు. దక్షిణ ముంబై లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ప్రమాణస్వీకార కార్యక్రమా న్ని నిర్వహించారు. శివసేన అగ్రనేతలు బాల్‌థాకరే, ఆనంద్ డిఘేలకు షిండే నివాళులు అర్పిస్తుండగా ఆయన మద్దతుదారులు భాల్‌థాకరే, డిఘేలను స్మరిస్తూ నినాదాలు చేశారు. గురువారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు కొత్త ప్రభుత్వంలో తాను భాగస్వామి కాబోనని ఫడ్నవిస్ ప్రకటించిన కొద్ది నిముషాలకే బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా మహారాష్ట్ర కొత్త కేబినెట్‌లో ఫడ్నవిస్ భాగస్వామి అవుతారని ప్రకటించారు. షిండే వర్గం సహకారంతో ఫడ్నవిస్ ముఖ్యమం త్రి అవుతారని అందరూ అంచనా వేసుకున్న త రుణంలో షిండే తదుపరి నూతన ముఖ్యమంత్రి అని ఫడ్నవీస్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్ర అభివృద్ధే తనకు ప్రాధాన్యమని, సమాజం లోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతానని షిండే వెల్లడించారు.
షిండే, ఫడ్నవీస్‌లకు ప్రధాని మోడీ అభినందనలు
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాధ్ షిండే, ఉపముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ గురువారం ప్రమాణస్వీకారం చేయడంపై ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయికి వీరు తీసుకెళ్లగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకారం జరగ్గానే మోడీ ఈమేరకు ట్వీట్ చేశారు. అట్టడుగు నుంచి ఎదిగిన షిండే తనకున్న రాజకీయ , శాసన సభ్యత్వ, పరిపాలనా అనుభవాలతో మహారాష్ట్రను ముందుకు తీసుకెళ్లగలరని నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఫడ్నవిస్‌ను ఉద్దేవించి ఆయన బిజెపి ప్రతికార్యకర్తకు స్ఫూర్తి ప్రదాతని కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News