Saturday, April 19, 2025

సోనూసూద్ పేరుతో మహిళను మోసం చేసి సైబర్ కేటుగాళ్లు

- Advertisement -
- Advertisement -

 

Cyber criminals fraud with Sonusood Name

 

అమరావతి: సైబర్ కేటుగాళ్లు సోనూసూద్ ట్రస్టు పేరుతో ఓ మహిళ ఖాతా నుంచి నగదు తస్కరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సత్యశ్రీకి అనే వివాహితకు ఆరు నెలల బాబు ఉన్నాడు. బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో వివిధ ఆస్పత్రులలో చికిత్స చేయిస్తోంది. ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా స్నేహితులు, బంధువుల ద్వారా ఆర్థిక సాయం తీసుకుంటుంది. ఓ వ్యక్తి సోనూసూద్ ట్రస్టు నుంచి ఫోన్ చేస్తున్నానని ఖాతా వివరాలు చెబితే డబ్బులు పంపిస్తానన్నారు. ఫోన్ లో ఎనీ డెస్క్ డౌన్ లోడ్ చేసుకోని వివరాలు వెల్లడించాలని కోరాడు. ఎన్ డెస్క్  నుంచి నెంబర్ తీసుకొని ఆమె ఖాతా నుంచి పలుమార్లు నగదు ఉపసంహరించుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News