Tuesday, November 5, 2024

అన్ని జిల్లాల్లో శాశ్వత స్టడీ సర్కిళ్ళు

- Advertisement -
- Advertisement -

Telangana Govt decides to Permanent study circles

86 గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్
సమీక్షా సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర వ్యాపితంగా 86 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిసి4, ఎస్‌సి75, ఎస్‌టి7 రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజీలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమాయ్యరు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని సిఎస్ ఈ సందర్భంగా అధికారులకు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించడానికి అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళ ఏర్పాటుకు కాన్సెప్ట్ నోట్‌ను సిద్దం చేయాలని ఆయన అధికారులను కోరారు.

అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రత కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడానికి, వంట సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం,గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, గిరిజన సంక్షేమ, సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి రోనాల్డ్ రాస్, బిసి సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కార్యదర్శి మల్లయ్య బట్ట, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటి కార్యదర్శి బి. షఫిఉల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News