Monday, December 23, 2024

రాజ్‌భవన్ పరిసరాల్లో భారీ భద్రత

- Advertisement -
- Advertisement -

Huge security around Raj Bhavan: CV Anand

బస చేయనున్న ప్రధాని మోదీ
4,000మందితో బందోబస్తు ఏర్పాటు
హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్: ఈ నెల 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం దేశ ప్రధాని మోదీ రాజ్‌భవన్‌కు చేరుకుంటారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ప్రధాని బస సందర్భంగా రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హెచ్‌ఐసిసి, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో నాలుగు వేల మందో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3,000మంది పోలీసులు పహారా కాస్తారని తెలిపారు. సభకు ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు సభకు హాజరవుతున్నందున ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిఐజి,ఎస్పి, ఎసిపి స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News