ముంబై : మహారాష్ట్రంలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం బలపరీక్షకు ముహూర్తం ఖరారైంది. 2, 3 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్పీకర్ పదవికి బిజెపి ఎంఎల్‌ఎ రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ స్పీకర్ పదవికి ఎన్నిక అవసరమైతే జూలై 3న నిర్వహించనున్నారు. అదే జరిగితే 4న బలపరీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శాసన సభలో తన మెజారీటిని నిరూపించుకోనున్నారు. శివసేనకు చెందిన 49 మంది శాసనసభ్యుల మద్దతు షిండేకు ఉంది. అంతేగాక బిజెపికి చెందిన 106 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థ్థులు కూడా ఏక్‌నాథ్ వైపే ఉండటంతో శాసన సభలో షిండే మెజార్టీ నిరూపణ లాంఛనంగా మారనుంది. సభలో బల నిరూపణ పూర్తయిన తరువాత షిండే తన కేబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు దాదాపుగా మంత్రులుగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
షిండే బలపరీక్షకు ముహూర్తం ఖరారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -