Monday, December 23, 2024

కేంద్రం ఇంధన ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

Govt slaps tax on petrol, diesel and ATF exports

పెట్రోలు డీజిల్ ఎటిఎఫ్ ఎగుమతులపై పన్ను
దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై భారీగా సుంకం
రిలయన్స్, ఒఎన్‌జిసి వేదాంత లాభాలపై నజర్
సరికొత్తగా విండ్‌ఫాల్ టాక్స్ పరిధిలోకి
హుటాహుటిన విదేశాలకు చమురుపై బ్రేక్‌లు

న్యూఢిల్లీ : పెట్రోలు డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. అదే విధంగా విమాన ఇంధనం (ఎటిఎఫ్) విదేశాలకు ఎగుమతి చేసినా ఈ సుంకం పరిధిలోకి వస్తుంది. రిలయన్‌స ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు విదేశాలకు పెట్రో ఉత్పత్తులు , జెట్ ఫ్యూయల్‌ను ఎగమతి చేస్తున్నాయి. ప్రస్తుత ఉక్రెయిన్‌సంక్షోభ దశలో భారత్‌కు అందే రష్యా ముడిచమురు కోటా ఎక్కువగా ఉంటోంది. దీనిని పేరొందిన బ్రాండ్ల చమురుకంపెనీలు తక్కువ ధరలకు రాబట్టుకుని తమ శుద్ధి కర్మాగారాలలో తగు విధంగా శుభ్రపర్చి ఇంధన అవసరాలు ఉన్న యూరప్ దేశాలకు ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం విధించిన ఎగుమతి పన్నులతో ఎగుమతి కోటాను బట్టి సంస్థలు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మరో వైపు స్థానికంగా దేశీయ స్థాయిలో క్రూడాయిల్‌ను ఉత్పత్తి చేసే ఒఎన్‌జిసి, వేదాంత లిమిటెడ్ వంటివాటిపై ప్రత్యేకంగా అదనపు పన్నుగా విండ్‌ఫాల్ టాక్స్‌ను విధించారు. ఈ పన్నుల విధింపు ప్రక్రియ గురించి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన వెలువరించారు.

పెట్రోలు, ఎటిఎఫ్‌లపై రూ 6 ఎగుమతి పన్ను
డీజిల్‌పై లీటరుకు రూ 13 వడ్డింపు

కంపెనీలు ఎగుమతులతో లాభాలు పొందుతున్నాయని నిర్థారించుకున్న కేంద్రం అన్ని అంశాలను పరిశీలించి పెట్రోలుపై లీటరుకు రూ 6 ఎగుమతి పన్నును విధించింది. ఇక డీజిల్‌పై ఈ పన్నును లీటరుకు రూ 13గా ఖరారు చేశారని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో వివరించారు. మరో వైపు దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడిచమురుపై టన్నుకు రూ 23,250 అదనపు పన్నును మోపారు. ముడిచమురుపై లెవీని ప్రభుత్వ ఆధీనంలోని ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్), ప్రైవేటు సెక్టార్‌లోని వేదాంతకు చెందిన కైర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ గడిస్తోన్న రికార్డు స్థాయి లాభాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రిత్వశాఖ అన్ని బేరీజు వేసుకుని ఈ సరికొత్త పన్నుల కసరత్తుకు దిగింది. దేశీయ ముడిచమురు సంబంధిత ఎగుమతుల టాక్స్ విధింపులతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ 67,425 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అంబానీల సారధ్యపు రిలయన్స్ చమురు సంస్థలు, రోస్‌నెఫ్ట్ మద్దతు ఉన్న నయారా ఎనర్జీ లిమిటెడ్ ఇటీవలి కాలంలో యూరప్ అమెరికాలకు విరివిగా చమురును పంపించడం వంటి అంశాలను కేంద్రం జాగ్రత్తగా పరిశీలించింది.ఈ కంపెనీలకు ఆదాయ అర్జన ఓ గాలిగా వీస్తున్నదని తెలుసుకుంది. దీనితో ఈ విపరీత లాభాల నేపథ్యంలో సరికొత్తగా విండ్‌ఫాల్ టాక్స్‌ను విధించారు.

దేశంలో పెట్రో ధరల తగ్గింపు ప్రక్రియలో భాగం

దేశంలో ఈ మధ్యకాలంలో వరుసగా విపరీత స్థాయిలో పెట్రోలు డీజిల్ ధరలు వంటగ్యాసు ధరలు పెరుగుతూ వచ్చాయి. దీనితో కేంద్రంపై ప్రతికూల ప్రభావం పెరుగుతూ రావడం వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నారు. ధరల కళ్లెనికి ముందు దేశీయంగా చమురు అందుబాటు ఎక్కువ కావడం, పెట్రోల్ పంప్‌ల వద్దకు సరైన నిల్వలు వెళ్లడం వంటివి జరగాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగుమతులపై పన్నును విధించారు. స్థానికంగా విక్రయాలకు బదులు ప్రైవేటు రిఫైనరీలు కొన్ని లాభసాటిగా ఉండే యూరప్, అమెరికాలకు అక్కడి చమురు అవసరాలు తీరేలా పెట్రోలు డీజిల్, విమాన ఇంధనం భారీగా ఎగుమతి చేయడానికి సిద్ధపడ్డాయి. దీనితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాలలో పెట్రోలు బంక్‌లలో తరచూ నోస్టాక్ బోర్డులు వెలిశాయి. ఈ సంక్షోభం ముదిరిపోకుండా ఉండేందుకు కేంద్రం ఇప్పుడు ఎగుమతి పన్నులను ఖరారు చేసిందని స్పష్టం అయింది. ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే రిటైల్ స్థాయిలో పెట్రోలు డీజిల్ అమ్మకాలతో వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం , రేట్లపై పరిమితులు తప్పనిసరి కావడంతో కంపెనీలు ఎక్కువగా ఎగుమతుల బాట పట్టాయి. అయితే ఈ దశలో దేశంలో తలెత్తే చమురు సంక్షోభం గురించి పట్టించుకునే అవసరం లేని విధంగా వ్యవహరించాయి. ఈ పరిణామాన్ని పరిశీలించి దేశీయ మార్కెట్‌లో చమురుకు కటకట ఉండకుండా చేసేందుకు ఎగుమతి పన్నుల చట్రంలోకి డీజిల్ పెట్రోలు, విమాన ఇంధన వనరులను తీసుకువచ్చినట్లు వెల్లడైంది.

పెట్టుబడులు లేని ఆదాయంపై పన్ను విండ్‌ఫాల్ టాక్స్

కంపెనీలు ఎటువంటి మూలధన పెట్టుబడులు, సరికొత్తగా వ్యాపార విస్తరణలకు దిగకుండానే దక్కించుకునే విపరీత అనూహ్య లాభాలపై వేసే అదనపు ప్రత్యేక పన్నునే విండ్‌ఫాల్ టాక్స్‌గా వ్యవహరిస్తారు. తక్కువ ధరలకు రష్యా నుంచి చమురు పొంది , దీనిని ఇతర దేశాలకు అత్యధిక లాభాలకు పంపించే బడాటలో సాగుతున్న కంపెనీల ఎగుమతులపై ఈ విండ్‌ఫాల్ టాక్స్ భారం పడుతుంది. ఇప్పుడు ఎగమతుల టాక్స్‌ల భారం పడిన దశలో శుక్రవారమే రిలయన్స్ షేర్లు 5 శాతం పడిపొయ్యాయి. మరో ఒఎన్‌జిసి షేర్లు ఓ దశలో పదిశాతం పతనం చెందాయి. ప్రత్యేకించి రిలయన్స్ ఇకపై భారీ స్థాయిలో ఆదాయం నష్టపోతుందని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News