ఎడ్జ్ బాస్టన్: ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న చివరి టెస్టులో భారత్ తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ లో 73 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (146) ధాటిగా ఆడి సెంచరీ చేశాడు. 89 బంతుల్లోనే శతకం బాదాడు. ఆరో వికెట్ పై రిషబ్ పంత్- రవీంద్ర జడేజా 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతో 98కే భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. రిషబ్ పంత్ కు రవీంద్ జడేజా సహకారం అందించడంతో తొలి రోజు ఇంగ్లాండ్ బౌలర్లపై అధిక్యాన్ని కనబరిచారు. ఇండియా బ్యాట్స్ మెన్లలో శుభ్ మన్ గిల్(17), ఛటేశ్వరా పుజారా(13), హనుమ విహారీ(20), విరాట్ కోహ్లీ(11), శ్రేయస్ అయ్యర్ (15), శార్థూల్ టాగూర్ (1) పరుగులు చేసి మైదానం వీడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా మ్యాట్ పాట్స్ రెండు వికెట్లు, బెన్ స్టోక్స్, జోయ్ రూట్ చెరో ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(83), షమీ(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.