Monday, December 23, 2024

5000 అడుగుల ఎత్తులో క్యాబిన్‌లో పొగ… ఢిల్లీకి తిరిగొచ్చిన స్పైస్‌జెట్ విమానం

- Advertisement -
- Advertisement -
Spicejet plane
ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని స్పైస్‌జెట్‌ ప్రతినిధి తెలిపారు.

న్యూఢిల్లీ: జబల్‌పూర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం క్యాబిన్‌లో పొగలు రావడంతో సిబ్బంది ఈ ఉదయం తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారని  ఓ వార్తా సంస్థ తెలిపింది. విమానం 5,000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో సిబ్బంది క్యాబిన్‌లో పొగలు చూశారు.

“ఢిల్లీ నుండి జబల్‌పూర్‌కు నడుపుతున్న స్పైస్‌జెట్ విమానం ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చింది, సిబ్బంది 5000 అడుగులు దాటిన సమయంలో క్యాబిన్‌లో పొగను గమనించారు; ప్రయాణికులు సురక్షితంగా దిగారు,” అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వార్తా సంస్థ ట్వీట్ చేసిన దృశ్యంలో పొగ నిండిన క్యాబిన్ కనిపించింది. విమానం ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ప్రయాణికులు బయటికి వస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి.

15 రోజుల్లో స్పైస్‌జెట్ విమానానికి ఇది రెండో అత్యవసర ల్యాండింగ్. ఇదివరలో జూన్ 19న 185 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం, పక్షి ఢీకొనడంతో దాని ఎడమ ఇంజన్ మంటల్లో చిక్కుకోవడంతో టేకాఫ్ అయిన వెంటనే పాట్నాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News