Monday, December 23, 2024

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు కెమిస్ట్ దారుణ హత్య!

- Advertisement -
- Advertisement -
Murder
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

ముంబయి: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన దర్జీ హత్య కేసు తరహాలోనే మహారాష్ట్రలోని అమరావతిలోనూ జరిగింది. బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు మద్దతుగా వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ ఫార్వార్డ్‌ చేశాడని మందుల దుకాణం యజమాని(కెమిస్ట్‌) ప్రహ్లాద్‌రావు(54)ను దుండగులు దారుణంగా చంపారు. గత నెల 21న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా,  అసలు నిందితుడు ఇర్ఫాన్‌ఖాన్‌ కోసం గాలిస్తున్నామని అమరావతి సిపి తెలిపారు. మరోవైపు ఉదయ్‌పుర్‌ తరహాలో ఈ కేసును కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News