కన్నూర్ : ఈ కపట కట్టుకథల దుమారంలో, ఇటువంటి కల్లాకపటం తెలియని ఆదరణ, ఆత్మీయతతో కూడిన ప్రశాంతత ఊరట నిస్తుంది. దేశానికి కావల్సింది ఇదే అని రాహుల్ గాంధీ స్పందించారు. కేరళలోని సొంత నియోజకవర్గం వాయనాడ్‌లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను తల్లిదండ్రులతో ఉన్న ఓ మూడేళ్ల పాప దూరం నుంచి పలకరించింది. వెంటనే దూసుకుంటూ రాహుల్ ఉన్న ఎస్‌యువి వాహనంలోకి చేరింది. ఆ పాపతో రాహుల్ కొద్ది సేపు మాట్లాడారు. నీ పేరేమిటీ? నాతో పాటువస్తావా? అని ప్రశ్నించారు. వీరిద్దరి ఫోటోలను వెలుపల ఉన్న వారు తమ సెల్‌కెమెరాలలో క్లిక్ మన్పించారు. కాంగ్రెస్ ఎంపి ఆ పాపకు ఓ చాక్లెట్ ఇచ్చి సెల్ఫీ దిగారు. తరువాత పాప వెళ్లిపోయింది. ఈ చిన్నారితో కొద్ది సేపు అయినా మాట్లాడటం తనకు ఆనందం ఇచ్చిందని ఇటువంటి నిర్మలమైన సహానుభూతి దేశానికి ఇప్పుడు అత్యవసరం అని రాహుల్ తమ ట్వీటులో తెలిపారు.
In an atmosphere of fake scripted propaganda, candid moments like these of kindness and compassion is what the country needs. pic.twitter.com/H5YXKQd2Aa
— Congress (@INCIndia) July 2, 2022