ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
ఇంజినీరింగ్ నిరుద్యోగులకు పండగ
హైదరాబాద్ : ఇంజినీరింగ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 1,663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్, ఫారెస్టు, ఫైర్, జై ళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమశాఖ, విద్య, ఆ రోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇది సువర్ణావకాశం. ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియెరె న్స్ ఇచ్చింది. ఇంజినీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్)లో 1238 పోస్టులు, ఇం జినీర్ ఇన్ చీఫ్ (ఆర్ అండ్ బి, ఎన్హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్యూబీ ఎస్, హెచ్ వోడీ)లో 284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్ హెచ్వోడీలో 53 , డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ (హెచ్వోడీ)లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుంది.