Monday, December 23, 2024

సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొని యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని ఎనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలో తన వద్ద ఉన్న కెమెరాతో ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు హంద్రి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన యువకుడు ఎనుగొండకు చెందిన ఐటిఐ చదువుతున్న కుడుముల రామకృష్ణ(18)గా గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు.

ITI Student died after train hit in Mahabubnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News