Sunday, January 19, 2025

శ్రీలంకతో పోల్చడానికి బండికి సిగ్గుండాలి: ఎమ్మెల్యే వివేకానంద

- Advertisement -
- Advertisement -

TRS MLA Vivekananda Fires On BJP

 

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని బిజెపి నేతలు ఓర్చు కోలేకపోతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఆదివారం టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎనిమిదేళ్లలో ప్రధాని మోడీ దేశానికి ఏం చేశారని నిలదీశారు. విభజన చట్టం హామీలపై సభలో మోడీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమవేశాలా.. తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలా అని ఆయన ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ను దూషించేందుకే సమావేశాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. మంత్రులు అనురాగ్ ఠాగూర్, స్మృతి ఇరానీ, బండి సంజయ్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధి కాదు.. ప్రజల మనసులు గెలిచి కష్టపడి పైకి వచ్చారని తెలిపారు. మంత్రి కెటిఆర్ కూడా ఉద్యమ సమయంలో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తండ్రి హిమాచల్ మాజీ సీఎం కాదా.. ఠాగూర్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధి కాదా వివేకానంద ప్రశించారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకు పోతోందన్నారు. అనురాగ్ ఠాగూర్ తెలంగాణలో తిరిగి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

తన సొంత రాష్ట్రం హిమాచల్ లో తెలంగాణ పథకాలు అమలవుతున్నాయా? ప్రశ్నించారు. గుజరాత్ లో పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించారు. తెలంగాణ లో 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంటు సరఫరా అవుతోంది. కేంద్ర మంత్రులు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ పై కక్ష గట్టేందుకే బీజేపీ సమావేశాలన్నారు. కేసీఆర్ పై బండి సంజయ్ ఏక వచనం తో మాట్లాడుతున్నారు. బండి సంజయ్ నెత్తి మీద వంద రూపాయలు పెడితే కూడా ఎవడూ పట్టించుకోరని వ్యంగ్యస్త్రాలు సందించారు. బండి సంజయ్ కి ఎవరో అవగాహన లేని వారు స్క్రిప్ట్ రాసిస్తున్నట్టున్నారు. బండి సంజయ్ బీజేపీ లో లేక పోతే ఎవడు పట్టించుకుంటాడు. బీజేపీ ఓటింగ్ శాతం ఎక్కడ పెరిగింది. వారణాసి లో ఎమ్మెల్సీ సీటు కూడా బీజేపీ ఓడిపోయింది. ఒకటి రెండు విజయాలు సాధించిన మాత్రాన ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణ ఓ రాష్ట్రం.. శ్రీలంక ఓ దేశం.. శ్రీలంక తో తెలంగాణను పోల్చడానికి బండి సంజయ్ కు సిగ్గుండాలని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News