Friday, December 20, 2024

ఎంజిబిఎస్- జెబిఎస్ మధ్య మెట్రో రైళ్ల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Stopped of metro trains between MGBS-JBS

హైదరాబాద్: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌ లో బిజెపి బహిరంగసభ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఇతర నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌ సమీపంలో ఉన్న ప్యారడైజ్‌, పరేడ్‌గ్రౌండ్స్‌, జెబిఎస్‌ మెట్రో స్టేషన్లలో సేవలను సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ సమయంలో మెట్రో రైళ్లు ఆ స్టేషన్‌లలో ఆగవన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్న ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మిగతా అన్ని స్టేషన్లలో మెట్రో సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News