Friday, November 22, 2024

తెలంగాణ స్పెషల్స్ ఏంటి.. వంటకాలను పరిశీలించిన మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi to Tasted Telangana Food Varieties

 

హైదరాబాద్ : హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజు కొనసాగాయి. సమావేశాలకు హాజరైన ప్రధాని మోడీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు. ఈ వంటకాలను ప్రధాని మోడీ స్వయంగా పరిశీలించి రుచి చూశారు. ఏమేం వడిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాల గురించి ప్రతినిధులు ప్రధానికి వివరించారు. శనివారం యాదమ్మ బృందం నోవాటెల్‌కు చేరుకున్నప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రధాని మోడీ మూడుసార్లు డైనింగ్ హాల్‌ను సందర్శించి కొన్ని వంటలు రుచి చూశారని, మరికొన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు.

బిజెపి కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన దాదాపు 1500 మందికి గత మూడు రోజులుగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వంటకాలను వడ్డిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ సహా కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆ పార్టీ దిగ్గజాలకు తెలంగాణ వంటకాలను తన చేతితో వండి వడ్డించే అవకాశం రావడం తన అదృష్టమని యాదమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన బండి సంజయ్‌కు రుణపడి ఉంటానన్నారు. మరోపక్క తనను నోవాటెల్‌లోకి అనుమతించలేదని సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని యాదమ్మ తెలిపారు. అవన్ని వదంతులని తనను ఎవ్వరూ అడ్డుకోలేదని సాదరంగా ఆహ్వానించారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News