- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఆదివారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదాటితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండగా పెద్ద అంబర్‌పేట్ సమీపంలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద గేదెలు అడ్డురావడంతో సుఖేందర్‌రెడ్డి ప్రయాణీస్తున్న కారు ముందు ఉన్న కాన్వాయ్ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో తనకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, అందరం క్షేమంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు.
- Advertisement -