Monday, January 20, 2025

లోయలో పడిన బస్సు: 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్ దేశం బలూచిస్తాన్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 19 మంది మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు 30 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెస్య్కూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పాక్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ముఖ్యమంత్రి మీర్ అబ్ధుల్ ఖుదీష్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News