Monday, December 23, 2024

ఇండస్ట్రీయల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా లక్ష్మీనర్సింహారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి చర్లపల్లి ఇండస్ట్రీయల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులయ్యారు. అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా గోవిందరెడ్డి, కార్యదర్శిగా చంద్రశేఖర్‌రెడ్డిని ఎన్నుకోగా, లక్ష్మీనర్సింహారెడ్డిని ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నుకోగా నూతన బాడీ 2025 వరకు కొనసాగనుందని తెలిపారు. రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్తగా, మదర్ డెయిరీ డైరెక్టర్‌గా కొనసాగుతూ పాటిమట్ల గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. లక్ష్మీనర్సింహారెడ్డి భార్య కల్పన మోత్కూరు ఎంపిపిగా పని చేస్తున్నారు. ఇండస్ట్రీయల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News