Monday, December 23, 2024

అల్లూరికి పాదాభివందనాలు: మోడీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అల్లూరి సీతారామరాజు జయంతి రోజున మనందరం కలుసుకోవడం అదృష్టమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు.  తెలుగులో మోడీ ప్రసంగించారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి, వీర భూమి అని ప్రశంసించారు. పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు అని పొగిడారు. యావత్ భారతావనికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, వీరభూమికి శిరస్సు వహించి నమష్కారం చేస్తున్నానని, 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయిందన్నారు. మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు. యావత్ భారత్ తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నానన్నారు. అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News