కోపెన్‌హెగన్(డెన్మార్క్): డెన్మార్క్ దేశం లోని కోపెన్‌హెగన్ లోగల ఫీల్డ్ షాపింగ్ మాల్‌లో ఆదివారం సాయంత్రం 5.36 గంటల ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన 22 ఏళ్ల డానిష్ వ్యక్తిని షాపింగ్ మాల్ దగ్గర పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఇది ఉగ్రచర్య కాదని, ఆ ఉన్మాదికి మానసిక సమస్యలు ఉన్నట్టు కోపెన్‌హెగన్ పోలీస్ చీఫ్ సోరెన్ థామ్సన్ ప్రకటించారు. ఈ సంఘటనలో అనేక మంది గాయపడినట్టు తెలుస్తోందన్నారు. డెన్మార్క్‌లో పెద్ద షాపింగ్ సెంటర్ అయిన ఈ ఫీల్డ్ మల్టీస్టోరీ షాపింగ్ మాల్ కోపెన్‌హెగన్‌కు శివారు ప్రాంతంలో ఉంది. అక్కడున్న సబ్‌వే సెంటర్‌తో సిటీ కనెక్టు అవుతుంది. కాల్పుల్లో ఎవరి ప్రమేయం లేకపోయినా తామింకా దర్యాప్తు చేస్తున్నామని సెరెస్ థామ్సన్ చెప్పారు. గన్‌తో మాల్ లోకి ప్రవేశిస్తున్న నిందితుని ఫోటోను పోలీసులు విడుదల చేశారు.
Three shot dead at Shopping Mall in Denmark