- Advertisement -
కొలంబో : శ్రీలంకలో ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. దీంతో జులై 4 నుంచి వారం రోజుల పాటు పాఠశాలలను పూర్తిగా మూసివేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది. ఈసారి సెలవుల సీజన్‌లో మిగిలిన సిలబస్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇటీవల జూన్ 18 నుంచి ఒక వారం సెలవులు ప్రకటించారు. శ్రీలంక విద్యాశాఖ మంత్రి నిహాల్ రణసింఘే మాట్లాడుతూ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పాఠశాల యాజమాన్యాలను కోరారు. ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలు అవసరం లేని విద్యార్థులతో డివిజనల్ స్థాయిలో తరగతులు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.
- Advertisement -