మనతెలంగాణ/హైదరాబాద్ (ఘట్‌కేసర్)ః విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, స్థంభాలు మార్చడానికి ఘట్‌కేసర్ ఎఇ, ఎస్‌ఇలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఘట్‌కేసర్ మండలంలోని అంకుషాపూర్‌లో రెండు స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్ మార్చడానికి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నవీన్ ఘట్‌కేసర్ విద్యుత్ శాఖ ఎఇ రాజ నర్సింగరావు, సబ్ ఇంజనీర్ అశోక్‌లను సంప్రదించాడు. ఈక్రమంలో రూ. 40వేల ఇస్తే ట్రాన్స్‌ఫార్మర్ తరలింపు, విద్యుత్ స్థంబాలను మార్చుతామని ఎఇ,ఎస్‌ఇలు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నవీన్‌ను లంచం డిమాండ్ చేయగా రూ. 25వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ ఎసిబి అధికారులను ఆశ్రయించి తనను లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎఇ, ఎస్‌ఇలపై ఫిర్యాదు చేశాడు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నవీన్ ఫిర్యాదు మేరకు ఎసిబి డిఎస్‌పి సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఎఇ రూ.19వేలు, ఎస్‌ఇ అశోక్ రూ.3వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతనం నిందితుల చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించిన లంచం మొత్తాలను స్వాధీనం చేసుకుని నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. ఎసిబి కోర్టు నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించారు.
Ghatkesar AE and SE in ACB Net