Tuesday, November 5, 2024

విమాన ప్రయాణంతో ఇబ్బంది పడ్డ విద్యార్థినికి సాయం

- Advertisement -
- Advertisement -

Union Minister Jyotiraditya Scindia helps student

సాయం చేసిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : విమాన ప్రయాణంతో అసౌకర్యానికి గురైన ఓ విద్యార్థినికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్వయంగా సహాయం అందించారు. తన సామాన్లు చెంతకు చేరేలా చొరవ తీసుకున్నారు. ‘మీ సామాన్లు హాస్టల్ గేట్ వద్దకు చేరుకున్నాయి. జాగ్రత్తగా ఉండండి ’ అంటూ ఆమె సమస్యను పరిష్కరించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే….ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో జులై ఒకటిన అనౌష్క ప్రయాణించారు. ఆ ప్రయాణంలో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దానిని ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండిగో విమానంలో ప్రయాణించిన సమయంలో నేను తీవ్రంగా ఇబ్బంది పడ్డాను.

వారి అసమర్ధత, ఆలస్యాల కారణంగా నా గమ్యస్థానం చేరుకోడానికి 24 గంటల వ్యవధిలో నాలుగు విమానాశ్రయాలకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా చేరుకుంటే, నా సామాన్లు డెలివరీ కాలేదని తెలిసింది. ఇప్పుడేమో విమానాశ్రయానికి వచ్చి సామాన్లు తీసుకు వెళ్లాలని చెబుతున్నారు. నేనింకా ఎంత ఇబ్బందికి గురవ్వాలి. నా కళాశాల నగర శివార్లలో ఉంటుంది. అక్కడి నుంచి క్యాబ్‌లో రావాలంటే నాకు చాలా మొత్తమే ఖర్చవుతుంది. మీ అసమర్ధతకు కూడా చెల్లించేలా చేస్తున్నారు.’ అంటూ ట్విటర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన చొర వ తీసుకుని సామాన్లు ఆమె వద్దకు వచ్చేలా చూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News