Saturday, November 23, 2024

ఆహార భద్రతా చట్టం అమలులో ఒడిశా టాప్

- Advertisement -
- Advertisement -

Odisha tops in implementation of Food Security Act

యుపి, ఎపిలకు రెండు, మూడు స్థానాలు
తెలంగాణకు 12వ స్థానం

న్యూఢిల్లీ: ఆహార భద్రతా చట్టం అమలులో ఒడిశా అగ్రస్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయని కేంద్రప్రభుత్వం మంగళవారం తెలిపింది. దేశంలో ఆహారం, పోషకాహార భద్రతపై రాష్ట్రాల ఆహార మ్ంరత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ 2022 సంవత్సరానికి సంబంధించి జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు సంబంధించి రాష్ట్రాల ర్యాంకుల సూచీని విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో( హిమాలయన్ రాష్ట్రాలు, ఐలాండ్ రాష్ట్రాలు) త్రిపుర తొలి ర్యాంక్ దక్కించుకోగా హిమాచల్‌ప్రదేశ్, సిక్కింలు తర్వాతి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.

రవాణా సదుపాయాల పరిమితులున్నప్పటికీ ఈ రాష్ట్రాలు జనరల్ రాష్ట్రాలతో కూడా పోటీ పడడంలో ఎంతో కమిట్‌మెంట్‌ను ప్రదర్శించాయని ఆ నివేదిక ప్రశంసించింది. ప్రభుత్వ ర్యాంకింగ్‌ల ప్రకారం ఒడిశా 0.836 స్కోరుతో టాప్ ర్యాంక్‌లో నిలవగా యుపి(0.797), ఎపి(0.794)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ నాలుగో స్థానంలో ఉండగా, దాద్రా, నాగర్ హవేలి, దామన్, డయ్యు, మధ్యప్రదేశ్, బీహార్, కర్నాటక, తమిళనాడు, జార్ఖండ్‌లు వరసగా తొలి పది స్థానాల్లో నిలిచాయి. కాగా కేరళ 11వ స్థానంలో, తెలంగాణ 12వ స్థానంలో నిలిచాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, గోవా వరసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులు ఇచ్చే ప్రక్రియ తమ మంత్రిత్వ శాఖ చేపట్టినప్పటికీ, థర్డ్ పార్టీ దీన్ని నిర్వహించిందని పీయూష్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News