Saturday, November 23, 2024

సాధారణ ప్రసవాలకు సకల సౌలత్‌లు

- Advertisement -
- Advertisement -

సర్కార్ దవాఖానాకే రావాలంటున్న వసంత
నాకు జరిగిన మేలు అందరికి జరగాలే..
మంత్రి హరీశ్‌కు ఉత్తరం రాసిన వేములవాడ వాసి

మనతెలంగాణ/వేములవాడ : ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితుల నుంచి ఇప్పుడు సర్కార్ దవాఖానాకే పోతా అనే రోజులు తెలంగాణలో వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన ఓ కుటుంబానికి సంబంధించి అనుభవం దానిని రుజువు చేస్తోంది. జిల్లాలోని వేములవాడ సమీప చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన వసంత, స్వామి దంపతుల బిడ్డ శిరీష పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కి తీసుకెళ్లాడు. వారు ఎలాంటి ఇబ్బంది లేదు.. కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం అనడంతో సాధారణ కాన్పులో పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంతోషం లో మంత్రి హరీశ్‌రావుకు తల్లి వసంత ఉత్తరం రాశారు. ‘సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిలా.్ల కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులు ఉన్నా యని సిరిసిల్ల సర్కారు దవాఖానాకు తీసుక పోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేసాడు.

అదే విధంగా బాగా నొ ప్పులతో మా బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్లినం. అక్కడ డాక్టర్ లు మంచిగ చూసి ఓపిక పట్టు సాధారణ కాన్పు చేపించుకో అన్నారు. మీరు( హరీశ్ రావు) టీవీల్లో చెపుతారు కదా సాధారణ కాన్పులు గురించి అని అలానే చేపించిన. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు వల్ల పైసా ఖర్చు లేదు. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు.. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనం లో ఇంట్లో దింపిండ్రు.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నాకు బిడ్డకు మనవడికి కలిగిన మేలు అందరికి తెలవాలన్న ఉద్దేశ్యం తో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నాను. సర్కారు దవాఖానాలో సకల సౌలత్‌లు ఉన్నాయ్.. ! కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికే రావాలి.. !! నాకు జరిగిన మేలు అందరికి జరగాలి’ అని మంత్రి హరీశ్‌కు రాసిన లేఖలో పేర్కొంది.

నా కూతురును ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు కొంచెం భయపడ్డాం. ఇరుగుపొరుగు వారి మాటలతో భ యం అనిపించినప్పటి కి వైద్యుల మాటలతో మాకు ధైర్యం వచ్చింది. దేవుని లగ్గం రోజే నా కూతురుకు నార్మల్ డెలివరీ అయి మనవడు పుట్టిండు. చాలా సంతోషం వేసింది. ఆసుపత్రిలో కెసిఆర్ కిట్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
శామంతుల స్వామి, శిరీష తండ్రి, చింతల్ ఠాణా, రాజన్న సిరిసిల్ల జిల్లా

నా కూతురు శిరీషను ప్రసవం కోసం ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని మా మేనల్లుడు శ్రీకాంత్ సూచించాడు. అతను చెప్పిన ధైర్యం తోనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాం. ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా నా కూతురికి డెలివరీ అయ్యిం ది. మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి ఆంబులెన్స్‌లో ఇంటికి పంపించారు. ఆ సంతోషంలోనే మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతగా లెటర్ రాయాలనిపించింది. వెంటనే నా కూతురుతో లెటర్ రాయించి పోస్టు చేశాం.
శామంతుల వసంత, (శిరీష తల్లి), చింతల్ ఠాణా, రాజన్న సిరిసిల్ల జిల్లా

ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామన్నా ను. కానీ, నా భర్త శ్రీ కాంత్ ధైర్యం చెప్పి ప్ర భుత్వ ఆసుపత్రికే వెళ్దామని అన్నాడు. ఆసుపత్రిలో వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. వైద్య సిబ్బందికి ధన్యవాదాలు.
బోయిని శిరీష, బాలింత, చింతల్ ఠాణా, రాజన్న సిరిసిల్ల జిల్లా

సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హారీశ్
సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకుని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను, అదే వి ధంగా సాధారణ కా న్పులు చేయించుకోవాలని, తనకు జరిగిన మే లు అందరికి జరగాలని ఉత్తరం ద్వారా ఒక మంచి ఉపదేశం చింతల్ ఠాణా ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన వసంత ఉత్తరం తనకు అందిందని, చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ ఉత్తరం ప్రజల్లో, మరీ ముఖ్యంగా మహిళల్లో చైతన్యస్ఫూర్తిని ఇస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News