Monday, December 23, 2024

వన్ ప్లస్ నోర్డ్ 2టి5G: వన్ ప్లస్ ఎసెన్షియల్స్ అప్ గ్రేడ్ అయ్యాయి

- Advertisement -
- Advertisement -

Oneplus launch Oneplus Nord 2 5G

బెంగళూరు: అంతర్జాతీయ టెక్నాలజీ బ్రాండ్ అయిన వన్ ప్లస్ నేడిక్కడ వన్ ప్లస్ నోర్డ్ 2టి5Gను ఆవిష్కరించింది. కంపెనీ అత్యంత అందుబాటు స్మార్ట్ ఫోన్ శ్రేణి – వన్ ప్లస్ నోర్డ్ కు ఇది తాజా జోడింపు. వన్ ప్లస్ నోర్డ్ 2టి అనేది అంతా ఎంతగానో అభిమానించిన వన్ ప్లస్ నోర్డ్ 2 ఎసెన్షియల్స్ ను స్వీకరించింది. అంతేగాకుండా యూజర్లకు మరింతగా ఎలివేటెడ్ అనుభూతులను అందించేందుకు వాటిని భారీగా అప్ గ్రేడ్ చేసింది. వన్ ప్లస్ 10 ప్రొ లో మొదటగా ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ నే వన్ ప్లస్ నోర్డ్ 2టి ప్యాక్స్ కూడా ఉపయోగిస్తున్నాయి. వేగవంతమైన, మృదువైన అనుభూతిని అందించేందుకు వీలుగా ఇది వేగవంతమైన, సమగ్రంగా అప్ గ్రేడ్ చేయబడిన మీడియా టెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ తో వస్తుంది. వన్ ప్లస్ 10ఆర్ నుంచి మెరుగు పర్చబడిన ఏఐ ఫ్లాగ్ షిప్ కెమెరాను కలిగిఉంటుంది. దాంతో పాటుగా ఆక్సీజన్ ఒఎస్ 12.1 ఉంటుంది.

ఈ సందర్భంగా వన్ ప్లస్ వ్యవస్థాపకులు పెటె లావ్ మాట్లాడుతూ, ‘‘వన్ ప్లస్ అనుభూతిని మరింత యా క్సెసబుల్ చేయాలన్న మా కట్టుబాటుకు అనుగుణంగా వన్ ప్లస్ 2టి అనేది చక్కటి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను సమ్మిళితం చేస్తుంది. ఒక గొప్ప ఎవ్రీడే స్మార్ట్ ఫోన్ హద్దులను మరింతగా అధిగమించింది’’ అని అ న్నారు. ‘‘అత్యున్నత శ్రేణికి చెందిన హార్డ్ వేర్ తో పాటుగా 80W SUPERVOOC, మీడియా టెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్, సోనీ IMX766 ఇమేజ్ సెన్సర్, ఆక్సీజన్ ఒఎస్ 12.1 వంటి సాఫ్ట్ వేర్ అంశాలను కూడా కలిగిఉంది. వీటన్నింటితో అందుబాటు ధర అంశం కన్నా మరింత ప్రీమియం అనే భావనను ఇది అంది స్తుంది’’ అని అన్నారు.

ధర, లభ్యత

భారతదేశంలో వన్ ప్లస్ నోర్డ్ 2టి5G విక్రయాలు జులై 5 మధ్యామ్నం 12 గంటల నుంచి వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్స్ మరియు అధీకృత పార్ట్ నర్ స్టోర్స్ లో ప్రారంభం కానున్నాయి. ఈ ఉపకరణం వెల రూ. 28,999 ల నుంచి ప్రారంభమవుతుంది.

వన్ ప్లస్ నోర్డ్ 2టి5G కొనుగోలుపై దిగువ ఆఫర్లు కొనుగోలుదారులకు లభ్యం కానున్నాయి:

జులై 5 నుంచి జులై 11 వరకు, ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారులు అమెజన్.ఇన్, వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్స్ మరియు ప్రధాన ఆఫ్ లైన్ పార్ట్ నర్ స్టోర్స్ లో కొనుగోలుపై రూ.1500 తక్షణ బ్యాంక్ డిస్కౌంటును పొందగలుగుతారు. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారులు జులై చివరి వరకు కూడా 3 నెలల నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు.

ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు అందించే పైన పేర్కొన్న ఆఫర్లతో పాటుగా ఎక్స్ క్లూజివ్ గా వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్ అందించే ఆఫర్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి:

– జులై 5 నుంచి జులై 14 వరకు, పాత వన్ ప్లస్ డివైజ్ వినియోగదారులు వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్ పై ఎక్స్ చేంజ్ బోనస్ తో అదనంగా రూ.3000 ఆదా చేసుకోవచ్చు.

– వన్ ప్లస్ స్టోర్ యాప్ పై మొదటి 1000 మంది కొనుగోలుదారులు వన్ ప్లస్ నోర్డ్ హ్యాండీ ఫ్యానీ ప్యాక్ ను పొందగలుగుతారు

రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు దిగువ పేర్కొన్న ఉద్వేగభరిత ఆఫర్లు మరియు ప్రయోజనాలు పొందవచ్చు:

– వన్ ప్లస్ నోర్డ్ 2టి కొనుగోలుదారులు వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్ పై ఒక బండిల్ గా కొ నుగోలు చేస్తే రెడ్ కేబుల్ కేర్ ప్లాన్ ను రూ.749లకే పొందవచ్చు. దీన్నే అమెజాన్.ఇన్, ఎంపిక చే సిన వన్ ప్లస్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్స్ లో రూ.999లకు పొందవచ్చు. 12 నెలల ఎక్స్ టెండెడ్ వా రంటీ, 120 జీబీ క్లౌడ్ స్టోరేజ్, డెడికేటెడ్ కస్టమర్ హెల్ప్ లైన్, ఇంకా మరెన్నో ఎక్స్ క్లూజివ్ ప్రయో జనాలు పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే.

– ప్రస్తుత రెడ్ కేబుల్ సభ్యులు వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్ పై వన్ ప్లస్ నోర్డ్ 2టి కొనుగోలు చేయడం ద్వారా రెడ్ కాయిన్స్ ఉపయోగించి రూ.1,000 దాకా ఆదా చేసుకోగలుగతారు. ఆఫర్ 11 జులై 2022 వరకు మాత్రమే.

అప్ గ్రేడెడ్ ఫ్లాగ్ షిప్ ఎసెన్షియల్స్

వన్ ప్లస్ నోర్డ్ 2టి అనేది వన్ ప్లస్ 10 ప్రొ లో మాదిరిగానే ఫ్లాగ్ షిప్ 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుంది. ఇది ఈ ఉపకరణం భారీ 4,500 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీని 1-100% దాకా 27 నిమి షాల్లోనే చార్జ్ చేస్తుంది. ఒక రోజుకు సరిపడా పవర్ ను అందించేందుకు కేవలం 15 నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. ఇది ఒరిజినల్ వన్ ప్లస్ నోర్డ్ కన్నా కూడా 120% అధికం.

వన్ ప్లస్ నోర్డ్ 2టి అనేది ఫాస్ట్ చార్జింగ్, వినియోగాలకు సంబంధించి టీయూవి రెయిన్లాండ్ ధ్రువీకరణ పొందింది. అంటే సురక్షిత వేగవంతమైన చార్జింగ్ ను అందించేందుకు గాను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ధ్రువీకరణ పొందింది. అంతేగాకుండా, వన్ ప్లస్ నోర్డ్ 2టి చార్జింగ్ టెంపరేచర్ ను రియల్ టైమ్ లో మానిటర్ చేసేందుకు, ఛార్జింగ్ ప్రక్రియ సందర్భంగా ఫోన్ సురక్షితంగా, కూల్ గా ఉండేలా చూసేందుకు 9 బిల్టిన్ టెంపరేచర్ సెన్సర్లను కలిగిఉంది. వన్ ప్లస్ నోర్డ్ 2టి ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ స ర్క్యూట్ (ఐసి)ని కలిగిఉంది. ఇది చార్జింగ్ సిస్టమ్ సురక్షితంగా, నిలకడగా చార్జింగ్ అయ్యేలా చూస్తుంది.

వన్ ప్లస్ నోర్డ్ 2టి వెనుకవైపున శక్తివంతమైన కెమెరా యూనిట్ ను కలిగిఉంటుంది. వన్ ప్లస్ 10ఆర్ కలిగి ఉన్నట్లుగానే అదే ఫ్లాగ్ షిప్ 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఒఐఎస్)లను కలిగి ఉంటుంది. 1200 అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ మోనో లెన్స్ లను కూడా కలిగిఉంటుం ది. దీని 1/ 1.56 అంగుళాల లార్జ్ సెన్సర్ సైజ్, 1.0 μm పిక్సెల్ సైజ్ ల కోసం 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 ఏరికోరి తీసుకోబడింది. ఇది ఒఐఎస్ కు సపోర్ట్ చేస్తుంది. 56% మరింతగా కాంతిని అనుమతిస్తుంది. మసగ్గా ఉన్న వాతావరణంలో కూడా మరింత ప్రకాశవంతమైన, డీటేల్డ్ ఫోటోలను తీసేందుకు వీలు కల్పి స్తుంది. వన్ ప్లస్ నోర్డ్ 2టి 1200 ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాను కలిగిఉంటుంది. ప్రతీ సీన్ ను మరింతగా కాప్చర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

వన్ ప్లస్ నోర్డ్ 2టి అనేది నైట్ స్కేప్ మోడ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ కాంతిలోనూ అధిక స్థాయి డిటేల్స్, సహజ రంగులతో ఫోటోలను షూట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ తో పొందిన సాధికారికతతో వన్ ప్లస్ నోర్డ్ 2టిపై ఏఐ కంప్యుటేషనల్ ఫోటోగ్రఫీ నూతన స్థాయికి చేరింది. వన్ ప్లస్ నోర్డ్ చరిత్రలోనే అత్యుత్తమ నాణ్యత గల లో- లైట్ ఇమేజెస్ ను అందిస్తుంది.

వెనుక నుంచి కాంతిపడడం, అసమాన లైటింగ్ లేదా రాత్రి సమయాల్లో షూటింగ్ జరిగేటప్పుడు సోనీ డీఒఎల్ – హెచ్ డిఆర్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ శక్తితో వన్ ప్లస్ నోర్డ్ 2టి యొక్క ఏఐ హైలెట్ వీడియో మోడ్ అనేది వీడియో క్లిప్స్ బ్రైట్ నెట్, కలర్, కాంట్రాస్ట్ లను మెరుగుపరుస్తుంది. ఎఐ హైలైట్ వీడియో మోడ్ అనేది మరింత బ్యాలెన్స్డ్, సహజమైందిగా కనిపించే ఫుటేజ్ ను అందించేందుకు వీడియో లో షార్ట్, ఓవర్ ఎక్స్ పోజర్ ను కూడా తగ్గిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ యొక్క మెరుగుపర్చ బడిన కంప్యుటేషనల్ పవర్ కారణంగా, వన్ ప్లస్ నోర్డ్ 2టి, 960 ఎఫ్ పిఎస్ వరకు హై ఫ్రేమ్ రేట్ స్లో-మోషన్ వీడియో ను రికార్డు చేయగలుగుతుంది. తద్వారా అధిక స్థాయి డిటేల్స్ తో వేగవంతమైన మూ మెంట్స్ ను కాప్చర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. వన్ ప్లస్ నోర్డ్ 2టి, ముందు వైపున వన్ ప్లస్ 10 ప్రొ తరహాలోనే 32 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సర్ ను కలిగిఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్), ఏఐ-డిబ్లరింగ్ ఆల్గోరిథమ్ ను సపోర్ట్ చేస్తుంది. తద్వారా ఫోటోలు, వీడియోల క్లారిటీ, షార్ప్ నెస్ లను మెరుగుపరుస్తుంది.

ఫాస్ట్ మరియు స్మూత్

వన్ ప్లస్ నోర్డ్ 2టి, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ తో శక్తివంతమైంది. ఇది ఆక్టా – కోర్ సీపీ యూ ను 33 GHz వరకు స్పీడ్ తో అందిస్తుంది. 6ఎన్ఎం ప్రాసెస్ ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ తయారు చేయబడింది. అది మెరుగైన గేమింగ్ పనితీరును, మరింత సామర్థ్యపూర్వక శక్తి విని యోగాన్ని అందిస్తుంది. హైపర్ ఇంజిన్ 5.0తో మెరుగైన టెంపరేచర్ నియంత్రణను అందిస్తుంది. మీడి యాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ 12 జిబి మరియు LPDDR4X RAM మరియు 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ తో కూడి ఉంటుంది. తద్వారా వన్ ప్లస్ సిగ్నేచర్ ఫాస్ట్ మరియు స్మూత్ అనుభూతిని అంది స్తుంది.

అదనంగా వన్ ప్లస్ నోర్డ్ 2టి వైఫై / బ్లూటూత్ హైబ్రిడ్ 2.0 టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. వైఫై నెట్ వర్క్ లకు కనెక్ట్ అయినప్పుడు ఇది మరింత నిలకడతో కూడిన స్పీడ్ లకు వీలు కల్పించడమే గాకుండా, ఏకకాలంలో వైఫ్, బ్లూ టూత్ ఉపకరణాలకు ఫోన్ కనెక్ట్ అయినప్పుడు ఆడియో లాటెన్సీ ని తగ్గిస్తుంది.

వన్ ప్లస్ నోర్డ్ 2టి 90 Hz రిఫ్రెష్ రేటుతో పెద్ద 6.43 అంగుళాల ఎఫ్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అది వేగవంతం, మృదువైన స్క్రోలింగ్ అనుభూతిని అందిస్తుంది. HDR10+ సపోర్ట్ తో యూజర్లు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ నుంచి మరింత సుసంపన్న, వైవిధ్యభరిత రంగుల్లో వీడియోలను చూడవచ్చు. వన్ ప్లస్ నోర్డ్ 2టి కి ముందు, వెనుక వైపున ఉండే డ్యూయల్ యాంబియెంట్ లైట్ సెన్సర్స్ దీని డిస్ ప్లే ప్రకాశాన్నికచ్చితమైన రీతిలో, మీరు ఉండే వాతావ రణానికి తగిన విధంగా ఆటోమేటిక్ గా సర్దుబాటు చేస్తాయి. తద్వారా మరింత సౌకర్యవంతమైన వీక్షణ అనుభూతిని అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సీజన్ ఓఎస్12.1 ప్రి-ఇన్ స్టాల్డ్ గా వన్ ప్లస్ నోర్డ్ 2టి లభిస్తుంది. మల్టీ టా స్కింగ్, మెరుగైన శక్తివినియోగం, మృదువైన రీతిలో గ్యాలరీ వ్యూయింగ్ లకు ఇది వీలు కల్పిస్తుంది. అ త్యంత స్మూత్, సెక్యూర్ అనుభవాన్ని అందించేందుకు గాను వన్ ప్లస్ నోర్డ్ 2టి రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ను, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ ను పొందుతుంది.

డిజైన్

8.2 మి.మీ. మందం, 190 గ్రాముల బరువుతో వచ్చే వన్ ప్లస్ నోర్డ్ 2టి చేతిలో అత్యంత సౌలభ్యాన్ని అం దిస్తుంది. వన్ ప్లస్ నోర్డ్ 2టి రెండు అద్భుత కలర్ వే – గ్రే షాడో, జేడ్ ఫాగ్ -లలో లభ్యమవుతుంది. గ్రే షాడో అనేది యాంటీ గ్లేర్ ట్రీట్ మెంట్ తో డార్క్ శాండ్ స్టోన్ ఫినిష్ ను కలిగిఉంటుంది. ఇది మైక్రో బీడ్స్ తో

టెక్స్చర్డ్, శాండెడ్ లుక్ ను అందిస్తుంది. అది చెమట, వేలిముద్రలకు కలర్ వే నిరోధకతను పెంచుతుంది. వన్ ప్లస్ వన్ కు మాత్రమే ప్రత్యేకమైన అందాన్ని అందిస్తుంది. జేడ్ ఫాగ్ వేరియంట్ గ్లాసీ జేడ్ గ్రీన్ ఫినిష్, మిస్టీ అండర్ టోన్స్ ను కలిగిఉంటుంది. ఫ్లాషీ, ఎలిగెంట్ ఈస్తటిక్స్ తో లభిస్తుంది.

వన్ ప్లస్ ఆడియో అనుభూతిని విస్తరించడం:

వన్ ప్లస్ నోర్డ్ 2టి5G ఆవిష్కరణకు తోడుగా ఈ బ్రాండ్ వన్ ప్లస్ నోర్డ్ బడ్స్, వన్ ప్లస్ బులెట్స్ వైర్లెస్ జె2 కు సంబంధించి నూతన కలర్ వేరియంట్స్ ను కూడా ఆవిష్కరించింది. నోర్డ్ బడ్స్ ఇప్పుడు నూతన ‘బ్లూ అగాటె’ రంగులో రూ.2,799లకు లభిస్తాయి. బులెట్స్ వైర్లెస్ జెడ్2 ‘అకౌస్టిక్ రెడ్’ లో రూ.1,999లకు ల భిస్తుంది. రెండు నూతన రకాలు కూడా వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్.ఇన్, ఫ్లిప్ కార్ట్, వ న్ ప్లస్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్స్, ఇతర ప్రముఖ ఆఫ్ లైన్ పార్ట్ నర్స్ స్టోర్స్ లో 2022 జులై 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి లభిస్తా యి.

– యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజర్లు వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమె జాన్.ఇన్, ఫ్లిప్ కార్ట్, వ న్ ప్లస్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్స్, ఇతర ప్రముఖ ఆఫ్ లైన్ పార్ట్ నర్స్ స్టోర్స్ లో వన్ ప్లస్ నోర్డ్ బడ్స్ (అన్ని రకాలు) కొనుగోలుపై రూ.250 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ను పొంద వచ్చు.

– యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజర్లు వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమె జాన్.ఇన్, ఫ్లిప్ కార్ట్, వ న్ ప్లస్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్స్, ఇతర ప్రముఖ ఆఫ్ లైన్ పార్ట్ నర్స్ స్టోర్స్ లో వన్ ప్లస్ బులెట్స్ వైర్లెస్ జెడ్2 (అన్ని రకాలు) కొనుగోలుపై రూ.150 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ను పొందవచ్చు.

Oneplus launch Oneplus Nord 2 5G

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News