Monday, December 23, 2024

ప్రముఖ వాస్తు నిపుణుడిని కత్తులతో 39 సార్లు పొడిచి….

- Advertisement -
- Advertisement -

Chandrashekhar Guruji Passed away

బెంగళూరు: ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర గురూజీ దారుణ హత్యకు గురైన సంఘటన కర్నాటక రాష్ట్రం హబ్బళిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇద్దరు వాస్తు సూచనల కోసమని చంద్రశేఖర్ ఉంటున్న హోటల్ కు వచ్చారు. చంద్రశేఖర్ కలిసి వెంటనే ఇద్దరు దుండగులు అతడిపై కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హోటల్ లో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. అతడి శరీరంపై 39 కత్తి గాట్లు స్థానిక పోలీస్ అధికారి చంద్రశేఖర గురూజీ తెలిపాడు. చంద్రశేఖర్ సివిల్ ఇంజనీరింగ్ తో ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ పొందాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16 అవార్డులు గెలుచుకున్నాడు. అన్ని టెలివిజన్ చానళ్లలో వాస్తుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News